అస్సాం రాష్టంలోని క‌రీంగంజ్ జిల్లా ర‌త‌బ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చెర‌గి ప్రాంతంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పాఠ‌శాల నుంచి ఇంటికి తిరిగి వ‌స్తున్న పిల్ల‌లు వేలాడే వంతెన కూల‌డంతో తీవ్రంగా గాయప‌డ్డారు. సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్నిఇత‌ర‌ గ్రామంతో కలిపే ఒకే ఒక‌ వంతెన ఇది. చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి పాఠశాలలకు చేరుకోవడానికి విద్యార్థులు గత అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు. చెరగీ విద్యాపీఠ్ ప్రైమ‌రీ స్కూల్‌కు చెందిన‌ విద్యార్థులు సింగ్లా నదిని దాటుతున్న‌ప్పుడు వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు నదిలో పడిపోయారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను ర‌క్షించి ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు స‌హాయ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

By Yuvataram

Common People Voice

Translate »