యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణా కు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్ గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు.

యూజీసీ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం .ఇంటిపేరు ఉరుపేరు ఒక్కటే కావడం యాదృచ్చికం.

By Yuvataram

Common People Voice

Translate »