మేషం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు.

వృషభం

కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిధునం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు అందుకుంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహం

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సమాచారం దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్య

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

తుల

సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

వృశ్చికం

దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.

ధనస్సు

విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

మకరం

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

కుంభం

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

By Yuvataram

Common People Voice

Translate »