Business Idea : పెట్టుబడి తక్కువలో బాగా లాభాలు పొందగలిగే వ్యాపారం ఇదే!!

Business Idea :  ప్రస్తుతం భారీ యంత్రాలకు బదులుగా పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతకుముందు ఫోటో కాపీ యంత్రాలు భారీగా ఉండేవి. క్రమంగా అవి పోర్టబుల్ జిరాక్స్ మిషన్లుగా మారాయి. పిండి మిషన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు పోర్టబుల్ మిషన్లుగా మార్కెట్లోకి వచ్చాయి. అదే క్రమంలో తందూర్ మిషన్లు కూడా చిన్న సైజులు దొరుకుతున్నాయి. వీటి ద్వారా చిన్న వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంది. ఆహార పదార్థాలలో తందూర్ కు ఉన్న ప్రాధాన్యత వేరు. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తందూర్ నాన్ వెజ్ రోటీలకు మంచి గిరాకీ ఉంది. పిజ్జాలను తయారు చేయడానికి కూడా తందూర్ మిషన్లు అవసరం అవుతాయి.

Electric tandoors business earn good money
Electric tandoors business earn good money

మైక్రోఓవెన్స్ కంటే కూడా చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. బొగ్గు మీద కాల్చిన రుచిని అందించడం ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ యొక్క ప్రత్యేకత. నాన్ వెజ్, వెజ్, పిజ్జా, నాన్ రోటి, పరోటాలతో పాటు మంచి రెసిపీలను కూడా ఈ మిషన్ల ద్వారా తయారు చేసుకునే అవకాశం ఉంది. చాలా పట్టణాలలో ఈ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ల ఆధారంగా పిజ్జా సెంటర్లు వెలిశాయి. ఈ ఒక్క మిషన్లు కొనుగోలు చేస్తే మిగిలినవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఈ తందూర్ మిషన్లు బాగా ఉపయోగపడతాయి. తందూర్ మిషన్ లో సెమి ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వేరియంట్ లు ఉన్నాయి.

ధరలో కూడా తేడా ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ లో టైమర్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ 5000 రూపాయలకి లభిస్తుంది. సెమీ ఆటోమేటిక్ తందూర్ మిషన్ ధర కొద్దిగా ఎక్కువే 35వేల రూపాయలు వరకు ఉంటుంది. ఈ మిషన్ల ద్వారా రెడీమేడ్ నాన్ రోటి లను తయారుచేసి అమ్ముకోవచ్చు. బల్క్ ఆర్డర్లను కూడా తీసుకోవచ్చు. ఇదే తందూర్ మిషన్ మీద ఆధారపడి ఓ చిన్న సైజు రెస్టారెంట్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీనిమీద కొంతవరకు పబ్లిసిటీ చేయగలిగితే ప్రతి నెల వేలల్లో ఆదాయాన్ని పొందవచ్చు. మీరున్న ప్రదేశాలలో బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే నివాసాల్లో జరిగే వేడుకలకు ఫుడ్ ఐటమ్స్ ని డెలివరీ చేయవచ్చు. దీంతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు.