Business Idea : ప్రస్తుత కాలంలో యువత ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునేవారు కానీ ఇప్పుడు ఉద్యోగం అనేది అంతిమ లక్ష్యం కాదనే భావన మొదలైంది. ఒకవైపు ఉద్యోగాలను చేస్తూనే మరోవైపు వ్యాపారం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. మరి ముఖ్యంగా స్టార్ట్ అప్ కల్చర్ రావడంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలను మొదలు పెడుతూ సత్తా చాటుతున్నారు. ఇక ఎలాంటి ఉద్యోగం చేయకుండానే స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. చాలామంది ఇలాగే వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అయితే ఇదేవిధంగా మీరు కూడా వ్యాపారం లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారా…?
అయితే మీకోసమే ఒక మంచి బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాం. మన భారతదేశంలో టీ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసింది. ఇలాంటి వ్యాపారని మొదలుపెట్టిన వారు ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు కూడా. అయితే ఇప్పటివరకు మనం టీ స్టాల్స్ లో ప్లాస్టిక్ లేదా పేపర్ తో తయారు చేసిన కప్పులలో టీ ని తాగాం. ఆ తర్వాత ఆ కప్పును అక్కడే పడేసి వెళ్ళిపోతాం. అయితే అలా కాకుండా తాగిన తర్వాత కప్పును తినేస్తే ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ గా మారింది.. ఇక పైన కనిపిస్తున్న ఫోటోలలో ఉన్న మిషన్ సహాయంతో ఈ కప్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్ కప్స్ లో టీ తాగినవారు టీతో పాటు కప్ ని కూడా తినేయొచ్చు.
ఇక ఈ మిషన్ విషయానికి వస్తే రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది. ఆన్లైన్లో పలు సంస్థల ద్వారా ఈ మిషన్లను మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మిషన్స్ తో పాటు కప్స్ తయారు చేసే ముడి సరుకులు కూడా వారే అందించడం జరుగుతుంది. అయితే ఈ వ్యాపారంలో ఒక కప్పు పై కనీసం 50 పైసలు లాభం పొందవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి పెద్దగా స్థలం కూడా కావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఒక చిన్న గదిలో ఈ మిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఈ బిస్కెట్ కప్స్ తయారీలో మైదా రాగి మొక్కజొన్న పిండి తో పాటు చక్కెర తేనే కూడా ఉపయోగిస్తారు. తయారీ అనంతరం వీటిని సరిగా మార్కెటింగ్ చేయగలిగితే లక్షల్లో సంపాదించవచ్చు.