After Wake up : ఉదయం నిద్ర లేవగానే ఎవరిని చూస్తే రోజంతా మంచి జరుగుతుందంటే..?

After Wake up : చాలామంది ఈరోజుల్లో నిద్రలేచిన మొదలు నుండి మళ్లీ నిద్రపోయేంతవరకు ప్రతిదీ సెంటిమెంటుగా భావిస్తారు. ఇది ఇలా చేయాలి అంటూ అది అలా చేయాలి అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. ఇంతకు నిద్ర లేవగానే ఎవరిని చూడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే అంతవరకు ప్రతిదీ ఓ సెంటిమెంట్ గా భావిస్తారు. నేను ఉదయం లేచినప్పుడు ఎవరి ముఖం చూశానో.. అనుకోకుండా ఎవరూ ఉండరు. ఆరోజు మంచి జరిగినా చెడు జరిగిన కారణం ఎటువంటిది అయినా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసి అనే ఆలోచన వస్తుంది. కొందరు నిద్ర లేవగానే దేవుడు ఫోటో చూస్తారు. మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు.

Advertisement

ఇంకొందరు పిల్లల ముఖం చూస్తారు. ఇలా ఎవరికి వాళ్లు సెంటిమెంట్ గా భావిస్తారు. ఉదయం లేవగానే ముందుగా ఏం చూడాలంటే..? చాలామంది నిద్ర లేవగానే తమ చేతులను చూసుకుంటారు. వారు తెలిసి తెలియక చూసిన ..అలా చూడడం మంచిదే. ఎందుకనేది ఓ శ్లోకం ద్వారా తెలియజేయబడినది.
“కరాగ్రే వసుదే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం”
కరాగే వసతే లక్ష్మి… అంటే చెయ్యి పై భాగాన లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది.
కర మధ్యే సరస్వతి… అంటే చేయిమద్దే భాగంలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది.
కరములే స్థితా గౌరీ… అంటే చెయ్యి చివరి భాగంలో గౌరీదేవి ఉంటుంది.

Advertisement

After Wake up : ఉదయం నిద్ర లేవగానే ఎవరిని చూస్తే రోజంతా మంచి జరుగుతుందంటే..?

If you see someone when you wake up in the morning, the whole day will be good
If you see someone when you wake up in the morning, the whole day will be good

ఈ శ్లోకం ద్వారా తెలిసింది ఏమంటే ఉదయం నిద్ర లేవగానే తమ రెండు చేతుల కళ్ళకు అద్దుకొని ఇలా మనసులో చదువుకోవాలి.ఏ పని చేయాలన్నా చేతి చివరి ఏళ్లతో ప్రారంభిస్తాము. చేతి వేళ్లతో ఎంత కష్టపడి పని చేస్తే అంత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అంత ధన ప్రాప్తి కలుగుతుంది. అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీదేవితో సమానం. సరస్వతి అనుగ్రహం కలగాలంటే. చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవడం మంచిది. అరచేయి మధ్యలో సరస్వతి ఉంటుంది . కాబట్టి ఇలా చదవడం వల్ల సరస్వతి కటాక్షం మీరు పొందుతారు.

కరములే స్థిత గౌరీ.. చేతి మూల మీదే శక్తి అంతా ఉంటుంది. మనం పైకి లేచేటప్పుడు అయినా కూర్చునేటప్పుడు అయినా చేతి తుమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం. మనం పైకి లేవగానే శక్తి అంతా చేతి మనీకట్టు దగ్గరే ఉంటుంది. అమ్మవారి స్వరూపాన్ని శక్తి అంటాం. అందుకే కరమూలే స్థితి గౌరీ అని చెబుతారు.

Advertisement