Puja Ruls : హిందూ సంప్రదాయంలో భగవంతుడిని భక్తి, శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేయడం వల్ల కోరికల త్వరగా నెరవేరుతాయి అని నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే లేచి తల స్థానాన్ని ఆచరించి పసుపు కుంకుమలను ధరించి తమ ఇష్ట దైవాన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా శాస్త్రాలలో పూజకు చాలా ప్రత్యేకత ఉంది. పూజ చేసే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి పొరపాట్లు చేసిన పూజ చేసిన ప్రతిఫలం ఉండదు.
కాబట్టి పూజ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు గణేశుడుకి తులసిని ,దుర్గామాతకు బిల్వపత్రాలను, సూర్య భగవానుడికి హారతిని ఇవ్వకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ చేసిన తర్వాత దీపం ఆరిపోయిందని అని అనవద్దు. దానికి బదులు దీపం కొండెక్కిందని చెప్పాలి. దేవుడికి వెలిగించిన దీపాన్ని నోటితో ఊదవద్దు. సహజంగా కొండ ఎక్కడం ఉత్తమం.
Puja Ruls : భార్య కుడి వైపు మాత్రమే ఎందుకు కూర్చోవాలి.

దేవుని పూజలో నేలపాలైన పువ్వుని మళ్లీ తిరిగి మరలా దేవునికి సమర్పించకూడదు. ప్లాస్టిక్ పాత్రలో నీటిని తీర్థంగా సమర్పించకూడదు. రాగి లేదా ఇత్తడి పాత్రలో మాత్రమే నీటిని సమర్పించండి. ఇంట్లో వ్రతం, హోమం ,యజ్ఞాలు వంటివి చేసేటప్పుడు భార్యను కుడి వైపున భర్త ఎడమవైపు కూర్చోవాలి. బ్రాహ్మణులకు పాదాభివందనం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు భార్య ఎడమవైపు ఉండాలి.
పూజ చేసే సమయంలో భక్తిశ్రద్ధల తో పూజ చేయాలి. ఒక దీపాన్ని మరొక దీపంతో వెలిగించకూడదు. ఇలా చేయడం వల్ల ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు. పూజ చేసే సమయంలో ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే ఒకరు దుస్తులను మరెక్కరు కూడా ధరించకూడదు. దేవుడికి పెట్టే నైవేద్యం మరి వేడిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి.