Devotional : ఇంటిముందు కానీ, కొన్ని వ్యాపార సంస్థల్లో గుమ్మడికాయని కడతారు. ఒకవేళ ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఒక బూడిద గుమ్మడికాయ, నరదిష్టి నివారణకు గోమాత సహిత నవ యంత్ర యుక్తా ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం వైపున బూడిద గుమ్మడికాయ మన ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి ఉన్నట్లయితే ఆ గుమ్మడికాయ కొన్ని రోజులు కుళ్ళి పాడై పోతుంది. ఇలా గుమ్మడికాయ పాడై పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి నర దిష్టి ఎక్కువగా ఉందని అర్థం, రెండవది ఇంటి పైన నకరాత్మక శక్తి ఎక్కువగా ఉందని అని కూడా భావించవచ్చు. నర దిష్టి తగిలితే నా పరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు అంటుంటారు. ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార సంస్థలకు కానీ నరదిష్టి నివారణకు గుమ్మడికాయ కట్టండి.
గుమ్మడికాయను శాస్త్రోప్తంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులుచే చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారం పైన బుట్టలో వేలాడు తీయండి. రోజు ఉండగా అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు, ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రంకు దీపం చూపించాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రం ఉండడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అని ఇంటి పై చూపించే నరదిష్టి నీ గుమ్మడికాయ లాగేసుకుంటుంది. మీరు సంవత్సరం మొత్తంలో ఎక్కువగా గుమ్మడికాయలు కుళ్లిపోతున్నాయి అంటే మీ ఇంటికి ఎక్కువ నరఘోష నరదిష్టి నరపిడ ఉందని గుర్తించుకోండి. వెంటనే పాడైపోయిన గుమ్మడికాయను పడేసి మరొక గుమ్మడికాయను పూజ చేయించుకుని కట్టుకోవాలి. ఇంటిలో కిరాయికి నివసిస్తున్న వారు కూడా ఇంటి గుమ్మం పై వైపున గుమ్మడికాయని కట్టుకోవాలి.
Devotional : ఇంటి ముందు గుమ్మడికాయని ఎందుకు కడతారు.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్ష ఉన్నట్టే. ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నర దోష, నర పీడ ,నరదిష్టి,నరగోష ,నరశాప శక్తి అంత కూడా కాలభైరవుని స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి కుమ్మడికాయ కట్టే విషయంలో అశ్రద్ధ చేయకండి. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని కలిపి కట్టినట్లయితే ఆసక్తి మరింత అయ్యి సంపూర్ణ ఫలితాలు మీకు అందుతాయి. ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార సంస్థల కాడికి కట్టిన గుమ్మడికాయలను ఎప్పుడు కప్పుడు తొలగించి కొత్తది కట్టాలా…
అని సందేశాలు చాలామందికి వస్తుంటాయి. ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార సంస్థలకు కట్టిన గుమ్మడికాయని ఒక సంవత్సరం తరువాత తీసివేయాలి. ఇంకా మధ్యలో గ్రహణములు వచ్చిన, ఇంట్లో పురుడు మళ వచ్చిన, మృతు సంబంధించిన సూతకం వచ్చిన, ఇంట్లో అమ్మాయిల పుష్పావతి అయిన ఇటువంటి సూతకాలు వచ్చిన తరువాత పూజ చేసి కట్టిన గుమ్మడికాయల శక్తిని కోల్పోతాయి. కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి. మనమే ఇంట్లో పసుపు ,కుంకుమలు పెట్టి కడితే సరిపోదు. దానికి విధి విధానంగా పూజ జరిపించి శుభముహూర్తాలలో కడితే మంచిది.