Devotional : ఎవరైనా ఈ వస్తువులను ఇస్తే మీరు తీసుకుంటే ఆ ఇంట్లో కష్టాలు ఎదుర్కోవాల్సిందే

Devotional : మన ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోయినప్పుడు పొరుగింటి వాటిని ఆడిగి తీసుకుంటాం. కానీ ఇలా తీసుకోవడం మంచిది కాదు. అయితే ఇలా పక్కింటి వారిని అడగకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు ఇలా పల్లెటూరులలో జరిగేవి కానీ పట్టణాలలో ఇలా తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలా ఎందుకు తీసుకోకూడదు చూద్దాం. కొన్ని వస్తువులపై శనిదేవుని ప్రభావం ఉంటుంది. ఇటువంటి వస్తువులను మనం తీసుకోవడం వల్ల శని ప్రభావం మనపై ఏర్పడుతుంది.

Advertisement

నువ్వుల నూనె మాత్రమే తీసుకోకూడదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు చాలామంది అసలు ఏ నూనె అయినా సరే తీసుకోవడం మానేశారు. అలాగే ఉప్పు ,నువ్వులు, బెల్లం, నెయ్యి ,ఇనుము వంటి వస్తువులను అప్పుగా తీసుకోకూడదు. ఇలాంటి వస్తువులను నేరుగా చేతికి తీసుకోకూడదు. నువ్వులు, బెల్లం తో చేసినవి కూడా తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఎదుటివారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తీసుకోవడం మంచిది. అలాగే చీపురు ,చేట ,చెప్పులు కూడా వేరే వారి వద్ద నుంచి తీసుకోకూడదు. అంతేకాకుండా నల్లని , నీలిరంగు దుస్తులను కూడా ఇతరుల నుండి తీసుకోకూడదు. ఇవి శని దేవునికి ఇష్టమైన వర్ణములు కనుక వీటిని వేరే వారు దగ్గర నుండి మనం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మనపై పడుతుందని నమ్మకం. పాల కోసం తోడు పెట్టడం కోసం తీసుకుంటారు. కానీ ఇలా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.

Advertisement

Devotional : ఎవరైనా ఈ వస్తువులను ఇస్తే మీరు తీసుకుంటే ఆ ఇంట్లో కష్టాలు ఎదుర్కోవాల్సిందే

devotional tips for things taking from others
devotional tips for things taking from others

ఇలా అడిగి తీసుకోవాల్సి వచ్చినప్పుడు మజ్జిగ కోసం అని చెప్పి తీసుకోవాలి. అలాగే పాత బట్టలు కూడా ఇరుగుపొరుగునుండి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యతో పాటు శని ప్రభావం కూడా మొదలవుతుంది. పాత బట్టలు కొన్ని సమయంలో మాత్రమే తీసుకోవాలి. తల్లి బిడ్డకు జన్మ జన్మన్నిచ్చేటప్పుడు బిడ్డ కోసం పాత బట్టలను వీటిని కూడా పిల్లలున్న వారి నుండి తీసుకోవడం బిడ్డకు మంచిది. ఇలా పాత దుస్తులు తీసుకోవడం వల్ల శని ప్రభావం మనపై పడుతుంది. ఈ శని ప్రభావం తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి వస్తువులను తీసుకోవడం వల్ల మనకు దారిద్రం పడుతుంది. కాబట్టి ఇలాంటి వస్తువులను ఇరుగుపొరుగునుండి తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

Advertisement