Zodiac signs : ప్రతి మనిషికి సంతోషం, బాధ రెండు ఉంటాయి. అయితే అన్ని బాధలను బయటికి చెప్పుకోలేరు. అలా మనసులోనే ఉంచుకొని ఆ బాధను రెట్టింపు చేసుకోలేరు. ఆ బాధ నుంచి బయట పడాలంటే జ్యోతిష్యం ప్రకారం నిపుణులు ఇలా చేయమని సూచిస్తున్నారు. మీ రాశిని బట్టి మీరు ఏం చేస్తే మీ మనసులోని బాధలు తీర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: మేష రాశి వారు తమ మనసులోని బాధను పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడం, గార్డెనింగ్ ప్రయత్నించడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వలన మనసులోని బాధను కొద్దివరకైనా తగ్గించుకోగలుగుతారు.
వృషభ రాశి: ఈ రాశి వారు తమ మనసులోని బాధను తొలగించుకునేందుకు ఎదుటి వారు చెప్పేది కాస్త అప్పుడప్పుడు వినడం నేర్చుకోవాలి. మరీ బండరాయిలా ఉండకుండా ఉండడమే మంచిది. ఈ రాశి వారికి మెడిటేషన్ చాలా అవసరం.
మిథున రాశి: ఈ రాశి వారు తమ మనసులోని బాధను తొలగించుకోవడానికి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు తమ మనసులోని బాధను పోగొట్టుకోవాలంటే యోగా చేయాలి. అలాగే ఉదయం లేవగానే తాజా గాలిని పీల్చుకోవాలి. వ్యాయామాలు లాంటివి కూడా చేస్తే మంచిది.
సింహరాశి: ఈ రాశి వారు తమ బాధలను నయం చేసుకోవాలంటే యోగ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. అది మీ మానసిక ప్రశాంతతను కలిగేలా చేస్తుంది.
కన్యారాశి: ఈ రాశి వారు ఫిజికల్ యాక్టివిటీస్ మీద దృష్టి సారించాలి. దాని వలన వారి మనసు ఉల్లాసంగా మారే అవకాశం ఉంది. బాధలు కూడా తగ్గిపోతాయి.
తులారాశి: రాశి వారు మ్యూజిక్ వినడం, పెయింటింగ్ వేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం చాలా అవసరం.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు పూలు, మొక్కలు, నీరు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు గడపడం వలన మనసులోని బాధను ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. అలాగే మెడిటేషన్ కూడా తప్పకుండా చేయాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ట్రావెలింగ్ చేస్తే వారి బాధ తగ్గిపోతుంది. అలాగే మ్యూజిక్ వినడం వలన కూడా బాధలు మర్చిపోగలుగుతారు.
మకర రాశి: ఈ రాశి వారు పాజిటివ్ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. పాజిటివ్ గా మాట్లాడే వ్యక్తులతో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి. ఇది వీరికి చాలా మేలు చేస్తుంది.
కుంభరాశి: ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో సమయం గడపడం మంచిది. యోగ ప్రాణాయామం లాంటివి చేయడం వలన కూడా బాధలు తగ్గిపోతాయి.
మీన రాశి: ఈ రాశి వారు బాత్ టబ్ లో వేడి నీరు పోసి అందులో ఉప్పు వేసి ఆ తర్వాత ఆ నీటిలో గడపాలి. అంతేకాకుండా మెడిటేషన్ చేయడం పాదాలకు మసాజ్ చేయడం లాంటివి చేసుకోవాలి. ఇలా చేయడం వలన తమ బాధ నుంచి బయటపడతారు.
Advertisement
Advertisement