Vinayaka Puja : ఎటువంటి కార్యాలను తలపెట్టిన విఘ్నాలు లేకుండా విజయం చేకూరాలని అన్నింట మొదటగా గణపతి పూజను చేస్తూ ఉంటారు.ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుడికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం వినాయక చతుర్థి ఆగస్టు 31 బుధవారం నాడు వచ్చింది. అయితే ఆ పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ పండుగను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వైభవంగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పూజా ఏ విధంగా చేయాలంటే.ఈ పూజకు కావలసిన సామాగ్రి; తమలపాకులు, పూలు, పండ్లు, కర్పూరం, పసుపు ,కుంకుమ, గంధం, అగరవత్తులు, బెల్లం, తోరం, కుందులు, కొబ్బరికాయలు, ఒత్తులు, నెయ్యి, నూనె ,పత్రి, పాలవెల్లి,ప్రసాదాలు మొదలైనవి. ముందుగా పసుపు గణపతిని చేసుకొని దానికి ధూప దీప ప్రసాదాలు పూర్తిచేసి… తదుపరి వినాయక విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసి ఆరాధించాలి.
Vinayaka Puja : వినాయక చవతి పూజ విధానం ఎంతో సులభంగా…
పసుపువినాయకుని పూజ శ్లోకం;శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని పాటించాలి. తదుపరి ఆచమనీయం:
ఓం కేశివాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వాయనాయ నమః, ఓం నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్ష జయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రయ నమః, ఓం హరయే నమః, ఓం క్రిష్ణాయ నమః, అని ఈ మంత్రాన్ని జపించి. వినాయకుడిని నమస్కరించి:
ఉత్తిష్టత్తు భూతపిచేచ వేతే భూమి బరాక, ఈత శ్యామ విరోధనా బ్రహ్మకర్మ సమారమే మంత్రాన్ని చదువుతూ అంక్షతలు తలపై నుండి వెనక వేసుకోవాలి. తర్వాత అపవిత్ర: సర్వ వస్తాంగా చూపిన యం: స్మరదై విరుపాక్షంస అని నాలుగు దిక్కుల ఉద్దరినితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి.

తర్వాత నేతితో చేసిన 12 రకాల వంటకాలను లేదా వీలైనంత మేరకు కొన్ని రకాల పిండి వంటలను చేయొచ్చు. ఇష్టమైన నైవేద్యం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె లాంటివి వాటిని వినియోగిస్తారు. ఈ ప్రసాదాలను ఆయనకి సమర్పించి తర్వాత పువ్వులతో పూజిస్తూ అతాంగ పూజ నిర్వహించాలి. తర్వాత 21 రకాల పత్రితో ఏక విశ్రాంతి పత్ర పూజ చేయాలి. తదుపరి గణేశుని అష్టోత్తర శతనామావళి పటించాలి. తర్వాత అతను దుర్యా యుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేసుకోవాలి.
ఈ పూజ పూర్తయిన తర్వాత గణపతి వ్రత కథను వినిపించాలి.లేదా చెప్పాలి. అలాగే వినాయక చతుర్థి పద్యాలు కూడా చదువుకోవాలి తర్వాత దేవునికి హారతి పట్టుకొని దీపానికి గణపతికి చూపిస్తూ మంగళహారతులను పాడాలి. తర్వాత వినాయకుడు ఎదురుగా వీలైనన్ని గుంజీలను తీయాలి. తర్వాత సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలి.