Sri rama Navami : శ్రీరామనవమి రోజున దేవుడికి పానకం ,వడపప్పు దేవునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను వెనుక ఆయుర్వేదిక్ కారణం కూడా ఉంది. శ్రీరామనవమి ఎండాకాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు ప్రసాదంగా పెట్టి భక్తులకి పంచి పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలుకులు వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు ,గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, దివ్య ఔషధంలా పనిచేస్తాయి.
అంతేకాకుండా పానకం శ్రీమహావిష్ణువుకి చాలా ఇష్టం. అదేవిధంగా పెసరపప్పు శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఈ పెసరపప్పుని వడపప్పు అంటారు. ఇది తీవ్రమైన వేడిని వడదెబ్బ తగలకుండా చేస్తుంది. పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతికరమైనది కాబట్టి వడపప్పు తినడం వల్ల బుధు డి అనుగ్రహం లభిస్తుంది.కానకానికి కావలసిన పదార్థాలు. నీళ్లు అరకప్పు, బెల్లం కప్పున్నారా, మిరియాలు పది యాలకులు ఆరు, సొంటి ఆఫ్ స్పూన్, నిమ్మరసం రెండు టీ స్పూన్లు, తులసి ఆకులు గుప్పెడు, ఉప్పు చిటికెడు, పచ్చ కర్పూరం చిటికెడు.
Sri rama Navami : దేవునికి ప్రసాదంగా పానకం, వడపప్పులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా…?

మిరియాలు యాలకులు విడివిడిగా దంచి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పానకం తయారీలో ఒక బౌల్లో నీళ్లు పోసి ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి. ఆ తరువాత మిరియాల పొడి. ఉప్పు, పచ్చ కర్పూరం వేయాలి. తులసాకులను సన్నగా తరిగి వేయాలి. నిమ్మరసం, సొంటి పొడి వేసి బాగా కలిపితే పానకం తయారవుతుంది. ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పెసరపప్పు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, మామిడికాయ ముక్కలు పావు కప్పు, కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం ఒక స్పూన్ . తయారీ విధానం చూద్దాం. పెసరపప్పుని బాగా కడిగి వడగట్టాలి.
ఇలా వడగట్టిన పప్పులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, మామిడి ముక్కలు, కీర తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉప్పు నిమ్మరసం వేసి కలిపితే వడపప్పు తయారవుతుంది.చలిమిడి కావాల్సిన పదార్థాలు. నైట్ అంతా నానబెట్టిన బియ్యం ఒక కప్పు, పంచదార పొడి ఆఫ్ కప్పు, పచ్చి కొబ్బరి తురుము మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి అర టీ స్పూన్, పాలు ఆపు కప్పు, నెయ్యి టేస్ట్ కి తగినంత. ఇప్పుడు చెలిమిడి తయారీ చూద్దాం. తడి బియ్యాన్ని వడగట్టుకుని.. మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. జల్లెడు పట్టినైనా మెత్తటి బియ్యం ప్పిండిని ఒక గిన్నెలో తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమంలో పాలు, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇలా చేసిన ముద్దను పానకం, వడపప్పుతో దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు