Evil Eye : కొందరికి అకస్మాత్తుగా కడుపునొప్పి, తలనొప్పి వాంతులు, విరోచనాలు వస్తాయి. అప్పుడు మన పెద్దవారు దిష్టి తాకిందేమో అని అంటూ ఉంటారు. ఇలా దిష్టి తగిలినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దిష్టిని తీస్తుంటారు. వ్యాపారస్తులకి వ్యాపారం తగ్గిపోయినప్పుడు నరదిష్టి తాకింది అని అంటుంటారు. అయితే చాలామంది నరదిష్టి తొలగించుకోవడానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే నరదిష్టి అనేది భయంకరమైనది, నర దిష్టి తాగితే ఎటువంటి వారు అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని నమ్ముతూ ఉంటారు. నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నరదిష్టి తొలిగిపోవాలంటే ఒకసారి మనం స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసి స్నానం చేయడం వల్ల నర దిష్టి తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల నరదిష్టి పీడ తొలగిపోయి, శారీరిక సమస్యలు కూడా ఉండవు. అలాగే లేజీనేస్ కూడా తగ్గిపోతుంది. అయితే ఇలా పుట్టినరోజు నాడు లేదా మంగళవారం రోజు ఉప్పు నీటినితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే. నిమ్మ పండును సగానికి కోసి దానికి కుంకుమ పసుపు బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట గుమ్మానికి విరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల కంటి దృష్టి తొలగిపోతుంది.
Evil Eye : మీరు నర దిష్టి సమస్యతో బాధపడుతున్నారా…? అయితే ఈ చిట్కాలు పాటించండి.

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి రోజుల్లో ఉదయం ,సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో లేదా వ్యాపారం చేసి చోట చల్లడం వల్ల నర దిష్టి తొలగిపోతుంది. అలాగే ఆదాయం లభిస్తుంది. ఒకవేళ అప్పులు బాధలు ఉంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. తప్పకుండా కులదైవాన్ని పూజించాలి. వినాయకుడికి అర్చన చేసి కొట్టిన కొబ్బరికాయలో నీటిని తీసివేసి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల నరదృష్టి తొలగింపబడి అనుకున్న ఫలితాలు సాధించి అప్పులు బాధలు తొలగిపోతాయి