Zodiac Signs : ఈ మాసంలో మేష రాశి వారికి జులై 2022 లో గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే

Zodiac Signs : ఈ జులై మాసం 2022లో మేష రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నెలలో మేష రాశి లో ఉన్న కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. అలాగే వృషభం లో బుధుడు శుక్రుడు కలిసి వుండి రెండో తేదీ తర్వాత మిధునంలోకి చేరుకుంటారు. 17వ తేదీ వరకు వృషభంలోనే ఉంటూ 17వ తేదీ తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇకపోతే తులా రాశిలో నీ కేతువు అలాగే మకర రాశిలో ఉండవలసిన శని కుంభం లో నుండి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

మేష రాశి వారి లో ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపో తాయి. కానీ మేష రాశి వారు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అశ్విని నక్షత్రం వారికి కొన్ని కళ్యాణానికి సంబంధించిన వ్యవహారాలలో చిక్కులు రాబోతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో చాలా అనుకూలత కనిపిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మాసంలో కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. భరణి నక్షత్రం వారు వీరికి డబ్బుకి సంబంధించిన విషయాలలో చాలా అనుకూలంగా ఉన్నది. రావలసిన ధనం అందుతుంది.

Advertisement

Zodiac Signs : ఈ మాసంలో మేష రాశి

horoscope July 2022 Zodiac Signs for Aries
horoscope July 2022 Zodiac Signs for Aries

ఈ భరణి నక్షత్రం వారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా వారికి మంచి ఫలితాలు అనుకూలిస్తాయి. కృత్తికనక్షత్రం వారు కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి. వీరికి 17 తర్వాత కొన్ని ఇతర దేశాలకు వెళ్లే మార్గాలు కనిపిస్తుంది. అయితే ఈ మేష రాశి వారికి కొన్ని సమస్యలు తొలగిపోయి డబ్బు విషయంలో మంచి అనుకూలత పొందుతారు. అలాగే గృహనికి సంబంధించిన విషయాలలో చాలా అనుకూలత కనిపిస్తుంది. అలాగే రైతులకు పంట చేలలో అనుకూలత, విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలత అలాగే విద్యార్థులకు కొన్ని ప్రమోషన్లు, ఉద్యోగాలు అందేలా కనిపిస్తుంది. కానీ ఈ మేష రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మేష రాశి వారికి అనుకూలమైన విజయాలని పొందాలి అంటే. ఈ రాశి వారు చేయవలసిన దేవతరాదన: సూర్య భగవానుని చూస్తూ సహస్ర నామాన్ని చదువుకోవాలి. ఇలా చేయడం వలన కొన్ని అనుకూలమైన విజయాలను పొందుతారు. అదేవిధంగా కుమారస్వామికి కానీ లక్ష్మీనరసింహ స్వామికి కానీ పసుపు కుంకుమలతో అభిషేకం చేయండి ఇలా చేయడం వలన గురు యొక్క సంచాలకం జరుగుతుంది. అలాగే గురు బలం కూడా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోయి. మంచి శుభవార్తలు వింటారు. అలాగే గోశాలకు వెళ్లి గోవులకు పండ్లు, కూరగాయలు, బెల్లం, గోధుమలు పెట్టాలి. ఇలా పెట్టడం వలన మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Advertisement