Sashtanga Namaskaram : సాష్టాంగ నమస్కారం ఎలా చెయ్యాలంటే…?

Sashtanga Namaskaram : ఒక వ్యక్తిని చూడగానే నమస్కారం అని చెప్పి గౌరవిస్తా. నమస్తే, నమస్కారం లేదా నమస్కారం…. ఈ పదాలు సంస్కృతంలో నుండి వెలువడినవి. మనసు లేదా నమం అనగా మనిషిలో గల ఆత్మ ను గౌరవించడం. ఇటువంటి సాంప్రదాయాలు భారతదేశంలో ఎక్కువగా వాడుకున్నా యి. ముఖ్యంగా వీటిని హిందూ, జైన, బౌద్ధ మతాలలో మనం ఎక్కువగా చూస్తాము. ఎవరైనా పెద్దవారు కానీ గురువులు ఎదురైనట్లయితే రెండు చేతులు జోడించి, తలన కిందికి ఉంచి నమస్కారం తెలియజేస్తాం. నమస్కారం చేయడానికి మన శాస్త్రాలలో నాలుగు భాగాలుగా ఉన్నవి. సాష్టాంగ నమస్కారం, దండ ప్రణాయం, పంచాంగ నమస్కారం, అంజలి నమస్కారం. సాష్టాంగ నమస్కారం లేదా అష్టాంగా నమస్కారమంటే మానవుడికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్థము. అవి ఏవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం

Advertisement

“ఉరసా ” అంటే తొడలు అని అర్థం.
“శిరసా” అంటే తల అని అర్థం.
“దృష్ట్యా” అనగా కళ్ళు అని అర్థం.
“మనసా” అనగా హృదయం అని అర్థం.
“వచసా” అనగా నోరు అని అర్థం.

Advertisement

Sashtanga Namaskaram : సాష్టాంగ నమస్కారం ఎలా చెయ్యాలంటే…?

how to do Sashtanga Namaskaram
how to do Sashtanga Namaskaram

“కరాభ్యం” అనగా చేతులు అని అర్థం.”కర్ణ భ్యాo ” చెవులు అని అర్థం. మానవుడు సహజంగా ఎనిమిది అంగాలతోనే తప్పు ఒప్పులు చేస్తుంటాడు. అందుకే గుడిలలో బోర్ల పడుకొని శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయే అంగాలకు నేలకు తగిలేలా నమస్కరించాలి. ముఖ్యంగా దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనక ఉండి చేయాలి. స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మహిళలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు చేతులు నుదురు మాత్రమే నేలకు తాగేలా నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది.

Advertisement