కాళ్లకు పసుపు రాసుకుంటారా ? పసుపు విషయంలో ఈ తప్పులు చేస్తే మీకే ప్రమాదం…!!

కాళ్ళకి పసుపు రాసుకుంటున్నారా.. పసుపు విషయంలో ఈ తప్పులు చేస్తే మీకే ప్రమాదం. ఆడవారు ప్రతి పండగకి అలాగే ఇంట్లో శుభకార్యాలకి కాళ్ళకి పసుపు రాసుకోవడం ఆనవాతిగా వస్తుంది. ముత్తైదువుల ఇంటికి పిలిచి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి వారికి తాంబూలం ఇస్తే ఆ ఇంటి ఇల్లాలికి సిరిసంపదలు అలాగే దీర్ఘశ మంగళ యోగం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు వారు ఇతరులకి పసుపు రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలని శాస్త్రము హెచ్చరిస్తోంది. ఒకవేళ మీరు పొరపాటున కాలుకి పసుపు రాసుకునే విషయంలో కొన్ని తప్పులు చేస్తే సంపద కరిగిపోతుంది. లక్ష్మీదేవి కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అడుక్కునే స్థితికి వచ్చేస్తారు.

Advertisement

కాళ్లకు పసుపు రాసుకునే విషయంలో ఏ తప్పులు చేయకూడదో మనం తెలుసుకుందాం. కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుందని ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సిరిసంపదలో తుల తుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాంటి కాళ్ళకి పసుపు రాసుకునే పద్ధతి వేరేగా ఉందని దాంట్లో కొన్ని తప్పులు చేయడం, ఇప్పుడూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని తెలుసుకుందా.. పసుపు అనేది సాధారణంగా మన దేశంలో ప్రకృతి వంటకంలోనూ ఆరోగ్యాన్ని కాపాడడం ఉపయోగపడుతుంది. మనం తయారు చేసే ప్రతి వంటకంలోనూ పసుపుని తప్పనిసరిగా వేస్తూ ఉంటారు. అదేవిధంగా పసుపుని పూజల్లో కూడా తప్పకుండా ఉపయోగిస్తారు. పసుపు లేకుండా ఎటువంటి పూజ అనేది మొదలుకాదు. ఇంట్లో కాని దేవాలయంలో కానీ పూజలు చేయాలంటే పసుపు కుంకుమ తప్పనిసరిగా ఉండాలి.

Advertisement
If you make these mistakes in the case of Turmeric you are at your own risk
If you make these mistakes in the case of Turmeric you are at your own risk

కొంతమంది మహిళలు పసుపు నీ కాళ్ళకి మొహానికి రాసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వివాహితులు పాదాలకు పసుపు రాసుకొని ఆ తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెడతారు. అయితే కాళ్ళకి పసుపు రాసుకునే సమయంలో మహిళలు కొన్ని పొరపాటులు చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవవలసి వస్తుంది. అందువల్లే మహిళలు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమంది మహిళలు కాళ్ళకి పసుపు రాసుకోవడానికి కాళ్లనీ నీటితో తడిపి ఆ తర్వాత పసుపు రాస్తూ ఉంటారు. ఇలా పసుపు రాయడం వల్ల పాదాలకు పూర్తిగా పసుపు అంటుకోదు.. ఇలా పాదాలకు పూర్తిగా పసుపు అంటుకోకపోవడం అశుభ్రంగా భావిస్తారు. అంతేకాకుండా పాదాలకు పసుపు పూర్తిగా అంటుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

అలాగే కొంతమంది పాదాలకు పసుపు అంటించిన తర్వాత మిగిలిన పసుపుని ఇంట్లో ఉన్న గడపలకి రాస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ దరిద్రం చుట్టుకుంటుంది. ఎందుకంటే గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాళ్లకు పెట్టి మిగిలిన పసుపుని గడపలకు పెట్టడం వల్ల ఆ ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే చేయకూడదు. కాళ్ళకి రాసుకున్న పసుపుని ఇక ఇతర ఏ పనులు కూడా ఉపయోగించకూడదు. గడపకి పసుపు రాసిన తర్వాత ఆ పసుపుతో కాళ్ళకి పసుపు రాసుకోవచ్చు కానీ కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత మళ్ళీ అదే పసుపుని గడపకి రాస్తే.. మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్ళితుంది. కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

Advertisement