Vastu Tips : జమ్మి చెట్టుతో ఇంట్లో ఉన్న సమస్యలను దూరం చేసుకోవచ్చా.
మన తెలుగువారి సంప్రదాయ ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దాదాపు అందరూ ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది.అయితే తెలుగు వారికి తులసి మొక్కే కాకుండా ఇంకొక మొక్క కూడా ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని చెబుతున్నారు. ఆ మొక్కే జమ్మి చెట్టు.. జమ్మి చెట్టు ని ఇంట్లో నాటితే… ఆనందం, ఐశ్వర్యమే కాకుండా డబ్బు కొరత కూడా ఉండదు.
అంతేకాకుండా ఈ చెట్టు ఇంట్లో ఉంటే శని దేవుని ప్రభావం మనపై పడకుండా ఉంటుందట. శని దేవునికి జమ్మి చెట్టు ప్రీతీకరమైనది. కావున… వాస్తు ప్రకారం జమ్మి చెట్లు ఇంట్లో నాటితే… సుఖ సంతోషాలు, డబ్బు కొరత ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క ఇంట్లో ఉంటే శని దేవుని ప్రభావం ఇంటి పై పడదని నమ్ముతున్నారు. అంతేకాకుండా.. మీ కుటుంబంలో ఎవరికైనా వివాహ సంబంధిత సమస్యలు ఉంటే జమ్మి చెట్టు నాటితే ఆ సమస్యల దూరమవుతాయి. జమ్మి చెట్టు ఇంట్లో నాటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. జమ్మి చెట్టు శనివారం రోజు నాటడం ఉత్తమం… దసరా రోజు ఇంట్లో నాటితే చక్కటి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు
Vastu Tips : జమ్మి చెట్టుతో ఇంట్లో ఉన్న సమస్యలను దూరం చేసుకోవచ్చా.

. జమ్మిచెట్టిన నాటేటప్పుడు శుబ్రపరమైన మట్టితో మాత్రమే నాటాలి. జమ్మి చెట్టు ఇంటి లోపల నాటకూడదు.. ఈ మొక్క ఇంటి ప్రధాన ముఖ ద్వారం వైపు ఉండాలి మరియు మీరు బయటికి వెళ్లేటప్పుడు అది మీ కుడి వైపు మాత్రమే చెట్టు ఉండాలి. అనగా ప్రధాన ద్వారానికి ఎడమవైపు జమ్మి చెట్టు నాటాలి. ఒకవేళ మీకు ముఖద్వారం అవకాశం లేకపోతే… టెర్రస్ పైన దక్షిణ దిశలో నాటవచ్చు. ఈ మొక్కకు సూర్యకాంతి నేరుగా పడేలా చూసుకోవాలి. ఈ మొక్క ఇంట్లో ఉన్నప్పుడు రోజు దేవుని గదిలో దీపం వెలిగించిన తర్వాత జమ్మి చెట్టు ముందు కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కొరత మెరుగుపరడమే కాకుండా వృధా ఖర్చులు తగ్గుతాయి.