మన ఇంట్లో ఎన్నోరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో మొక్కలు ఉండడం వలన ఇంట్లో ఉన్న మనుషులకి ప్రశాంతత దొరుకుతుంది. అలాంటి మొక్కలలో ఒకటి మన ఇంట్లో పెంచుకుంటే ధనానికి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ చెట్టు యొక్క కొమ్మల కింద స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఆ మొక్కే బిల్వపత్రం మొక్క. ఈ చెట్టు ఆకులతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను దేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారు.
ప్రధానంగా ఈ మూడు బిల్వ చెట్లు పేడులను శివునికి అర్పిస్తే శివుడి కటాక్షకం కలుగుతుందని నమ్ముతుంటారు. అదేవిధంగా బిల్వపత్రం మానవుని జీవితంలోని దోషాలను, కీడును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ బిల్వపత్ర ఆకులను మహా శివునికి నైవేద్యంగా పెడితే పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ చెట్టును ఆరాధిస్తే ఇంట్లో పెంచుకుంటే మీకున్న దోషాలు అన్ని తొలగిపోతాయి. ఈ బిల్వపత్రం శివుడు పార్వతి ఉంటారని నమ్ముతారు.. కావున శివుడికి బిల్వ పత్రాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే బిల్వ పత్ర జలాన్ని నుదుటిపై పెట్టుకుంటే సకల తీర్థయాత్రలు వెళ్లిన పుణ్యం వస్తుంది. అలాగే సోమవారం బిల్వ పత్రాలు కోయకూడదు అని చెప్తుంటారు.

ఇలా చేస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ బిల్వపత్రం చెట్టుకి ఆహారం పాయసం, నెయ్యి సమర్పించడం వలన పేదరికం నుంచి బయటపడతారట. అలాగే సంపద కూడా పెరుగుతుందట. కాబట్టి మన ఇంటి లో ఈ బిల్వ మొక్క లేదా చెట్టు ఉంటే మనకి అంతా మేలే జరుగుతుందని చాలామందికి తెలియదు. ఈ బిల్వపత్రమే కాకుండా పండు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు పొందవచ్చు. ఈ మొక్కను ఎంతో భక్తితో పూజించడం వలన ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని ముఖ్యంగా ఈ బిల్వ పత్రం మొక్కను ఇంటిదగ్గర పెంచినట్లయితే డబ్బు లేని లోటు తీరిపోతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు..