Lunar-Eclipse-2023 : ఈరోజే పాక్షిక చంద్రగ్రహణం… ఘడియలు ఇవే..

Lunar-Eclipse-2023  : ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది అత్యంత అరుదైన గ్రహణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహణం శరత్ పౌర్ణమితో కలిసి వస్తుంది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి గ్రహణం ఏర్పడలేదు. అయితే ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తో సహా పలు దేవాలయాలను మూసివేయడం జరిగింది. ఇక ఈ చంద్రగ్రహణం ప్రభావం భారత్ లో కూడా పడనుంది. ఇక ఈ గ్రహణం అర్ధరాత్రి 1:05 నిమిషాలకు ప్రారంభమై 20 నిమిషాల పాటు కొనసాగుతుందని నిపుణులు తెలియజేశారు. అనంతరం ఆదివారం రోజు తెల్లవారుజామున 2:24 నిమిషాలకు ఈ గ్రహణం ముగుస్తుందని తెలియజేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:50 నిమిషాల నుండి గ్రహణం ముగిసే సమయం వరకు సూతక కాలంగా భావిస్తారు.

Advertisement

october-2023-lunar-eclipse

Advertisement

ఇక ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశం తో పాటు ఆసియా, ఆఫ్రికా ,వంటి దేశ ప్రజలు కూడా వీక్షించవచ్చు. అలాగే నేపాల్ ,శ్రీలంక , బంగ్లాదేశ్, మంగోలియా ,చైనా ,ఇరాన్ ,అఫ్గానిస్థాన్ జర్మనీ, అల్జీరియా ,పోలాండ్ నైజీరియా , బ్రిటన్ ,ఆస్ట్రేలియా ,జపాన్, ఇండోనేషియా ,థాయిలాండ్, స్వీడన్ ,మలేషియా, ఉత్తర కొరియా ,దక్షిణ కొరియా వంటి దేశాలలో కూడా ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అయితే చంద్రగ్రహణం అనేది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. భూమి యొక్క నీడ చంద్రుడు పై పడటం వలన చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు.దీనినే మనం చంద్రగ్రహంగా పిలుస్తుంటాం. అయితే భూమి యొక్క నీడ చంద్రుడిపై సగభాగం వరకే పడినప్పుడు దానిని పాక్షిక చంద్ర గ్రహణంగా పరిగణిస్తారు. ఇక ఈ చంద్రగ్రహణాన్ని నేరుగా కూడా చూడవచ్చు. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ గ్రహణాన్ని నాసా లైవ్ లో చూపించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక దీనిని అధికారిక వెబ్ సైట్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

october-2023-lunar-eclipse

ఇక ఈ చంద్రగ్రహణం సమయంలో శ్రీకాళహస్తి మినహాయించి మిగతా దేవాలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల తిరుపతి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం,కానిపాకం ,శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, సింహాచలం నరసింహస్వామి ఆలయాలు కూడా గ్రహణం సమయంలో మూసి వేయడం జరుగుతుంది. సుమారు 8 గంటల పాటు ఈ ఆలయాలను మూసివేస్తున్నట్లుగా సమాచారం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈరోజు సాయంత్రం 7:05 నిమిషాల నుండి మూసివేస్తామని అర్చకులు తెలియజేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ జరిపించి ఆలయాన్ని తిరిగి ఆదివారం తెల్లవారుజామున 3:15 నిమిషాలకు తెరవనున్నట్లు టీటీడి తెలియజేసింది. ఆ తర్వాత యధాతధంగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.

Advertisement