Annadanam : పరబ్రహ్మ విశ్వరూపమైన అన్నదానం చేయటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అంటుంటారు మన పెద్దలు. ప్రస్తుత కాలంలో ఆకలితో బాధపడేవారు లేకుండా ఉండేందుకుగాను చాలామంది దాతలు అన్నదానం చేస్తుంటారు. నేత్రదానం, రక్తదానం ఇలా రకరకాల దానాలలో అన్నదానానికి చాలా ప్రత్యేకత ఉంది. మనం ఇరుగు, పొరుగు వారికి ఎన్ని దానధర్మాలు చేసినప్పటికీ అన్నదానం చేసినప్పుడు కలిగే తృప్తి వేరుగా ఉంటుంది.
భూమి మీద ఉన్న సకల జీవరాసుల కి ఆహారమే ప్రధానం. ఆహారం లేకపోతే జీవనం అసాధ్యం. ఇకపోతే కాశి అన్నపూర్ణ దేవి అనుగ్రహం లభించినట్లయితే అన్నం కడుపునిండా దొరుకుతుందని పండితులు చెబుతారు. చాలామంది భోజనం చేసే సమయంలో అన్నపూర్ణాదేవిని తలుచుకొని మొదటి ముద్దని కళ్ళకు అద్దుకొని తింటుంటారు. అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించాలి అంటున్నారు పెద్దలు. అన్ని దానాలలో కెల్లా గొప్పది అన్నదానం కాబట్టి ఈ దానాన్ని యజ్ఞంలో భావించి చేయవలసి ఉంటుంది.

మత ,ప్రాంతా, కుల ,బాస భేదాలు లేకుండా మనసులందరూ కలిసి అన్నదానం చేస్తే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. తిరుపతి, నంద్యాల ప్రాంతాలలో అన్నదానం రోజు జరుగుతుందట. అక్కడ భక్తులు అన్నదానం దైవ ప్రసాదంగా భావించి పుచ్చుకుంటారు. గోదానం ,వస్త్ర దానం, భూదానం వంటి దానాలు విశిష్టమైనవే కాక వీటన్నింటి కంటే కూడా అన్నదానం గొప్పది అని పెద్దలు చెబుతుంటారు. కొన్ని పురాణాలు ప్రకారం కూడా అన్నదానం అత్యంత విశిష్టమైనది.
Annadanam : అన్నదానం యొక్క విశిష్టత ఇదే
భగవంతుడు యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి భక్తులకు మోక్షం ప్రసాదించాలని కథనాలు పురాణంలో ఉన్నాయి. ఆకలి అన్న పేద వాళ్లకు అన్నదానం చేయడం వల్ల మనసుకి సంతృప్తి కలుగుతుంది. చాలామంది దాతలు అన్నదానం చేయడానికి ముందంజలో ఉంటారు. ఆకలి బాధ తొలగించేందుకు గాని అన్నదానం సహాయపడుతుంది. సాటివారి ఆకలి తీర్చేందుకు అన్నదానం సహాయపడుతుంది అని పెద్దలు చెబుతుంటారు