Vastu Tips : తెల్ల జిల్లేడు చెట్టు అంటే అందరికీ తెలిసింది. ఈ మొక్క ఇంట్లో వాస్తు దోషాలను తొలగింప చేయడమే కాకుండా, వివిధ రకాల శారీరక, ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే సిరి సంపదలు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, ప్రశాంతత తో పాటు ఆర్థిక వ్యవహారాలు వంటి అన్ని సమస్యలకు దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. చాలామంది తమ వ్యాపారం, లావాదేవీలలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల్లో ఎదురుదెబ్బ లు అనుభవిస్తారు. అలాగే రుణ బారాలా పాలవుతున్నారు. ఇటువంటి వారికి తెల్ల జిల్లేడు చక్కటి పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది.
ఈ మొక్క మనకు సర్వసాధారణంగా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాలలో విరివిరిగా దొరుకుతుంది. ఈ మొక్క ఆరు నుంచి ఏడు అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. తెలుపు ,నీలం రంగు వర్ణాలు కలిగి ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు ముందు సూర్యభగవానికి నమస్కరించి, ఈ మొక్క ఆకులతో రవి గ్రహాని పూజిస్తే సూర్య దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. హనుమాన్, లక్ష్మీదేవి, గణపతి, శని మహాత్మునికి ఈ మొక్క పూలతో పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. శని దోషం ఉన్నవారు ప్రతి మంగళ, శనివారాలలో ఈ పూలతో హారాన్ని తయారుచేసి ఆంజనేయుడికి లేదా శని దేవునికి మాల సమర్పిస్తే చాలా మంచిది. తెల్ల జిల్లేడు మొక్క అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం.
Vastu Tips : తెల్ల జిల్లేడు చెట్టు తో వాస్తు దోషాలన్నీ మటుమాయం.

ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటే, ఇటువంటి నరదిష్టునైనా దూరం చేస్తుంది. ప్రత్యేకంగా ఇంటి కుడి వైపు ఈ మొక్కని నాటినట్లయితే వాస్తు దోషం పూర్తిగా తొలగిపోతుంది. తెల్ల జిల్లేడు మొక్కను ఇంట్లో నాటి పూజించినట్లయితే అనేక దోషాలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి గుమ్మం మధ్యలో కానీ దేవుడు గుమ్మానికి కానీ ఈ పూలమాలను కడితే వాస్తు దోషం తొలగిపోతుంది. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వల్ల వాస్తు దోషాలే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. తెల్ల జిల్లేడు చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే పాలు ఎంతో విషపూరితమైనవి.
ఈ మొక్క పూలను తుంచేటప్పుడు పాలు శరీరం మీద పడకుండా జాగ్రత్తలు వహించాలి. ఈ మొక్కలో 65 ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క వేరుని పసుపు నీటిలో నానబెట్టి సేవిస్తే శరీరంలోని అనేక విష పదార్థాలు తొలగిపోతాయి. కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే ఈ ముల్లు లోపల ఉండి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. దీని పాలను ముళ్ళు ఉన్న చోట రాస్తే ముళ్ళు బయటకు వచ్చి తక్షణమే నొప్పిని తగ్గిస్తుంది. నడుము నొప్పి లేదా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే, ఈ చెట్టు ఆకులను కాల్చి, నొప్పి ఉన్న ప్రదేశంలో వేడి చూపడం వల్ల వెంటనే ఈ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.