Unknown Facts : ప్రతి జీవికి పుట్టుక, మరణం అనేది సహజం. అయితే మనిషి చనిపోయే ముందు ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని సైన్స్ చెబుతుంది. మరణానికి కొన్ని క్షణాల ముందు తన బాధ్యతలను సంతానానికి అప్పగించి తర్వాత భగవంతుడిలో ఐక్యం అయిపోతాడు. అయితే మరణం సమీపించే ముందు జీవిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. ముఖ్యంగా నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపించడం, శరీరం ఎడమ భాగం చిట్లిపోతున్నట్లుగా అనిపించడం ఈ సమయంలోనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందని, ముక్కుకొన భాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా భావిస్తారు.
మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ పుడుతుంది. అయితే మనిషి మరణించేటప్పుడు ఆ నీడ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాని నీరు లేదా నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతం అని భావిస్తారు. హిందూ పురాణం ప్రకారం మనిషి చనిపోయే సమయంలో వారిలో నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే వారు స్వర్గానికి వెళతారని చెబుతారు. శ్రీకృష్ణుడి భగవద్గీతలో శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉంటాయని, ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు చేస్తారో, వారి శరీరం ఎగువ ద్వారాల నుండి వారి ఆత్మ బయటికి వెళుతుందట. శరీరం ఎగువ భాగంలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉంటాయి.
జీవితాంతం మంచి పనులు చేయడంలో నియమగ్నమైన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు. వారి ఆత్మలు ఈ ఎగువ ద్వారాల గుండా బయటకు వెళతాయి. మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటికి వస్తే ముక్కు కొంచెం వంకరగా మారుతుందని నమ్మకం. కళ్ళ నుంచి బయటికి వస్తే కళ్ళు మూసుకోరు. చెవి నుంచి బయటికి వస్తే పైకి లాగినట్లు కనిపిస్తుంది అని భగవద్గీత చెబుతుంది. అయితే మరణం తర్వాత కూడా మనిషి జీవితం కొనసాగుతుందని ఇస్లాం చెబుతుంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు, శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని, భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతుంది. మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకు అవగాహన ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.