Devotional : హిందువులు ప్రతి మంగళ ,శనివారాలలో ఆంజనేయస్వామిని ఎక్కువగా పూజిస్తారు. సాధారణంగా అందరికీ ఆంజనేయ స్వామి అనగానే సింధూరమే గుర్తుకువస్తుంది. అందరూ దేవుళ్లకు పసుపు కుంకుమలు పెట్టి… ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం పెడుతుంటారు. ఇప్పుడు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. రాముడు రావణాసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు ఆంజనేయస్వామి భుజాలపై ఎక్కి యుద్ధం ప్రారంభిస్తాడు.
ఆ సమయంలో వేసిన బాణాలు రావణాసురుడు హనుమాన్ కి తగిలి ఒళ్లంతా రక్తంతో తడిసిపోతుంది. అయినా సరే ఏమాత్రం చెల్లించకుండా యుద్ధంలో పాలుపంచుకుంటాడు. యుద్ధం అనంతరం ఆంజనేయ స్వామి ఒళ్లంతా పూచిన మోదుగ చెట్టులా మారిందని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు. శ్రీరాముడు తన కోసం ఆంజనేయుడుని చూసి ఎంతో గానో మెచ్చి… ఆ రంగులో ఉన్న సింధూరాన్ని ఆంజనేయుని మెనికి చూస్తే ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చి సంతోషంతో పొంగిపోతాడని చెప్పాడట.
Devotional : హనుమాన్ కి సింధూరం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా…?

అందుకే ఈ రామాయణ కారణంగా ఆంజనేయ స్వామి సింధూరం అంటే ఇష్టపడతాడని చెబుతుంటారు. అది కాక రక్తం రంగు పరాక్రమం అందుకే స్వామికి సింధూరాన్ని బొట్టుగా పెడతారని హిందువులు నమ్ముతుంటారు. అందువల్ల హనుమాన్ కి ఎవరు పూజ చేసిన సింధూర తిలకాన్ని కచ్చితంగా పెడతారు. భక్తులు కూడా పూజకు ముందు సమయంలోనే ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటున పెట్టుకున్న తర్వాతే పూజ ప్రారంభిస్తారు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భయభ్రాంతులు, బాధలు తొలగిపోతాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.