Aja Ekadashi : శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి అజ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటారు. ఈ వ్రతం వలన ఎన్నో రకాల శారీరక మరియు మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వలన సుఖ సంతోషాలు పొందుతారని, ఆర్థిక ఇబ్బందులు తొలిగుతాయని భక్తుల నమ్మకం.హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే హిందు శాస్త్రం ప్రకారం ఏడాదిలో 26 ఏకాదశలుంటాయి. అయితే ఈ ఏకాదశి నామాలను విన్న వారికి పాపాలు తొలగుతాయని విశ్వసిస్తారు. ఇక ఈ ఏకాదశిలలో అజ ఏకాదశి ఒకటి. ఈ అజ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి తమ కోరికలను విష్ణుమూర్తితో చెప్పుకుంటూ పూజలు చేస్తారు.
అజ ఏకాదశి….
హిందూశాస్త్రం ప్రకారం అజ ఏకాదశి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో కృష్ణపక్షంలో జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన రోజు ఆదివారం సెప్టెంబర్ 10 2023 న వచ్చింది. దీని యొక్క శుభ సమయం సెప్టెంబర్ 9న రాత్రి 9.17 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 10 రాత్రి 9.28 నిమిషాలకు ముగుస్తుంది. దీంతో అజ ఏకాదశి వ్రతం సెప్టెంబర్ 10న ప్రారంభించబడుతుంది.
ఉపవాస సమయాలు ,నియమాలు…
* అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
* పని ముగిసిన అనంతరం స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి.
* విష్ణుమూర్తికి పసుపు రంగు చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు కనుక ఈ రోజున పసుపు బట్టలు ధరించడం శుభసూచికం.
* మొదట సూర్య భగవానుడికి నీటిని సమర్పించిన తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి.
* పూజ కోసం ఒక పీఠను సిద్ధం చేసుకుని లక్ష్మీనారాయణ విగ్రహం లేదా చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి. అనంతరం విష్ణువు ను పసుపురంగు పుష్పాలు, పండ్లు ,దీప ధూపాలతో పూజించాలి.
* పూజలో ఏకాదశి వ్రత కథను పట్టించి జపించాలి. తర్వాత విష్ణుమూర్తికి హారతిని ఇచ్చి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. భక్తిశ్రద్ధలతో మనసులోని కోరికలను కోరుకోవాలి.
*అజ ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున పూజ చేసిన వారు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయకుండా ఏకాదశి వ్రతం పూర్తి కాదు.
* ఇక ఈ వ్రతాన్ని సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6.04 నుండి 8.33 వరకు ఆచరించవచ్చు. అలాగే ద్వాదశి తిధి రాత్రి 11 గంటలకు ముగుస్తుంది కనుక ఈ లోపే ఉపవాస దీక్ష చేపట్టాలి.
గమనిక : ఈ సమాచారాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం , నిపుణుల అంచనాల మేరకు రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.