Hindu Wedding : మన హిందూ సంప్రదాయాలలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి అయిన తరువాత వధువు , వరుడు కి పురోహితుడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అసలు అరుంధతి నక్షత్రం ఏమిటి… పెళ్లి అయిన తర్వాత దంపతులకి ఎందుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారనే సందేహాలు చాలామందికి వస్తాయి. ఇప్పుడు అరుంధతి నక్షత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అరుంధతి వశిష్ట మహర్షి భార్య. బ్రహ్మ కుమార్తె పేరు సంధ్య దేవి. తనకు ఉపదేశం చేసేందుకు బ్రహ్మచారి కోసం వెతుకుతున్న సమయంలో వశిష్ట మహాముని కనిపిస్తాడు
Hindu Wedding : పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా.
. అతడే తనకు ఉపదేశం చేసేందుకు తగిన వాడని భావించిన సంధ్యాదేవి. బ్రహ్మచారి అయినా వశిష్ఠుడు ఆమెకి ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఆ తరువాత సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆగ్ని నుంచి ప్రాత: సంధ్య, సామయం సందెలతోపాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. ఆ అందమైన స్త్రీ రూపమే అరుంధతి. ఈ అందగత్తె అయిన అరుంధతి పై వశిష్ఠుడు మనసు పడతాడు. ఆమెని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో వశిష్ఠుడు తన కమలాండాలని అరుంధతికి ఇచ్చి తాను తిరిగి వచ్చేంతవరకు చూస్తూ ఉండమని చెప్పి వెళ్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా వశిష్ఠుడు తిరిగి రాకపోవడంతో అరుంధతి ఆ కమలాండాలనే చూస్తూ ఉండిపోయింది.

చాలామంది పండితులు ,రుషులు ఆమె చూపును వేరొక వైపు తిప్పాలని ప్రయత్నించిన ఆమె మాత్రం కమలాండం పైనుంచి చూపుతిప్పలేదు. ఇక ఏమి చేసేది లేక విష్ణువుడిని వెతికి తీసుకొచ్చి ఆమె ముందు ఉంచారు. ఆయన రావడం వల్ల తన చూపుని కమలాండం నుంచి విష్ణుడి వైపు మరలించింది. ఈ సన్నివేశం కారణంగా అరుంధతి మహా పతివ్రతగా నిలిచిపోయింది. అందుకే వివాహమైన తర్వాత వరుడు వధువులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతిలా సుధ్గునాలు కలిగి ఉండాలని ఆ బంధం అరుంధతి వశిష్ఠుల చిరస్థాయిగా వెలగాలని కోరుకుంటారు.