Ganesh Pooja : ఆనందం ,జ్ఞానం మరియు మంచి శ్రేయస్సుకి కొరకు వినాయకుడిని పూజిస్తారు. మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి రానుంది. దీనినే గణేష్ చతుర్ద అని కూడా అంటారు. ఈ రోజున ఇంట్లో గణపతిని ప్రతిష్టించి పూజిస్తారు. ఈ శుభకార్యం తల పెట్టాలన్న, పూజ చేయాలన్న ముందుగా వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజున గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి ఇష్టమైన వస్తువులను సమర్పిస్తారు. ఆరోజున నుదుటిపైన ఎర్రటి సింధూరం పెట్టుకుంటారు. ఎర్రటి సింధూరం ధరించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
కొన్ని పురాణాల ప్రకారం, గణేషుడు తన చిన్నతనంలో సింధూరం అనే రాక్షసి రక్తాన్ని ఇతని శరీరంపై పోస్తాడు. ఆనాటి నుంచి గణపతికి ఎర్ర సింధూరం అంటే ప్రీతి. వినాయకుడికి కుంకుమతో అర్చన చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకున్న పనులు లో అవిజ్ఞాలు కలగకుండా సంపూర్ణమవుతాయి. వినాయకుడికి కుంకుమను క ప్రసాదంగా పెడితే ఆ వ్యక్తి శాంతి ,సౌభాగ్యం లభిస్తుందని చెబుతారు.
Ganesh Pooja : మీ ఇంట్లో విగ్నేలన్ని తొలగిపోతాయి.

అంతేకాకుండా పెళ్లి కానీ వారికి త్వరగా వివాహ భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఏదైనా పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు వినాయకుడికి కుంకుమ పెడితే ఆ పనులలో శుభవార్త వింటారు. ఉద్యోగానికి లేదా ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు ఈ పని చేయడం మర్చిపోకండి.ఉదయాన్నే స్థానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి. విఘ్నేశ్వరుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజిస్తే మంచిది. ఎర్రటి పూలతో పూజ సమర్పిస్తే అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. పూజ అయిన అనంతరం గణేశుడికి లడ్డూని ప్రసాదంగా సమర్పించాలి. వినాయక చవితి నాడు గరికపెట్టి, బెల్లం తో ఉండ్రాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతారు