Kangana Ranaut : బాలీవుడ్ ఫైట్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. బాలీవుడ్ లో ఉన్న నెపోటిసమ్ గురించి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు చేసే అరాచకాల గురించి ఓపెన్ అవుతూ ఉంటారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కంగనా ఏ మాత్రం వెనకడుగు వేయదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనను అయిన ఆమె ఢీకొడతారు. అందుకే ఆమెను లేడీ ఫైట్ బ్రాండ్ అని పిలుస్తారు.
మరి ముఖ్యంగా హృతిక్ రోషన్ తనను ఎలా వాడుకుని ఇబ్బందులు పెట్టాడో , ఎలా మోసం చేశాడో ఓపెన్ గా అందరికీ చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించింది కంగనా రనౌత్. అసలు మన దేశంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇంతలా వైరల్ కావడానికి ప్రధాన కారణం కూడా కంగనా అని చెప్పాలి.అయితే కంగనా తాజాగా పి వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చెన్నై లోని మీడియాతో మాట్లాడారు.
ఇక తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని కుండ బద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే రోజా సినిమాలో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదని చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడాలని మీడియా కోరగా కంగనా షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు రోజా ఎవరని , ఆమె ఎవరో తనకు తెలియదని , ఆమెలాంటి వారు ఉన్నారని నాకు అసలు తెలియదని కంగనా సంచలన కామెంట్స్ చేశారు. అయితే గతంలో రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదని చెప్పిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు కంగనా ఇచ్చిన ఆన్సర్ రోజాకు పెద్ద షాక్ లాంటిదని చెప్పాలి.