Aishwarya Rajesh : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారట. ఆమె కష్టాలను చూస్తే కన్నీళ్లు కూడా వస్తాయి. అలాంటి అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేష్. టాలెంటెడ్ హీరోయిన్ గా సినిమాలో నిలబడిన ఐశ్వర్య చిన్నప్పటి నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాలలో ఐశ్వర్య తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి రాజేష్ అప్పట్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా సెకండ్ హీరోగా, విలన్ రోల్స్ చేశారు. అలాగే లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి స్వయాన తన మేనత్త. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య కెరీర్ ప్రారంభమైంది.
అయితే 8 ఏళ్ల వయసులోనే ఐశ్వర్య తండ్రి రాజేష్ మరణించారు. తండ్రి మరణంతో కుటుంబం కృంగిపోయింది. పెద్దయ్యాక అండగా ఉండాలనుకున్న అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించారు. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ కుటుంబంలో వరుస మరణాలు తనను ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమకు వచ్చాక రాకముందు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. స్టార్ హీరోయిన్ గా కాకపోయినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చినట్లు ఆమె తెలియజేశారు.
Aishwarya Rajesh : నా జీవితంలో అన్ని కష్టాలే…

తెలుగు అమ్మాయి అయినా ఐశ్వర్య తమిళ పరిశ్రమలో తన కెరీర్ ను మొదలుపెట్టారు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశారు. తర్వాత ముట్టై, కణ లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య ఫస్ట్ మూవీ రాంబంటు. హీరోయిన్ అయ్యాక కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో తెలుగులోకి అడుగు పెట్టారు. అలాగే ఐశ్వర్య టాలీవుడ్ లో మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలో చేశారు. ఈ సినిమాలో ఒకటి కూడా అంతగా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. తమిళంలో మాత్రం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఐదు తమిళ చిత్రాలతో పాటు ఓ మలయాళ చిత్రం తెరకెక్కుతుంది. వీటిలో విక్రమ్ హీరోగా నిర్మిస్తున్న ధ్రువ నక్షత్రం అనే భారీ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం.