Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ సినీ తారలకు సంబంధించిన వీడియోలను ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే రష్మిక ,కత్రినా కైఫ్ ,కాజోల్ వంటి వారి ముఖాలను మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలపై సినీ ప్రముఖులు అమితాబచ్చన్ ,కీర్తి సురేష్ ,నాగచైతన్య, విజయ్ దేవరకొండ , స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వీడియోలు రావడం ఆగడం లేదు.
తాజాగా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ అలియా భట్ కు సంబంధించిన వీడియోను కేటుగాళ్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్త వైరల్ గా మారింది. అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఓ మహిళకు సంబంధించిన వీడియోకు ఆలియా ముఖాన్ని జత చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సినీ తారలపై ఇలాంటి వీడియోలు చేయడం సమంజసం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అదే ఓ సాధారణ కుటుంబానికి చెందిన వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారి పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ఐటి శాఖ కూడా ఈ వీడియోలపై స్పందించి ఆగ్రహించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు ఇలాంటి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ విస్తృతంగా వ్యాపించి అనేక రకాల అనార్థాలకు దారితీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఏఐ టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.