Pushpa 2 The Rule : రాజ భవనంలా ఉన్న అల్లు అర్జున్ ఇల్లు .. లీక్ చేసిన రష్మిక ..

Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ పుష్ప ది రూల్ ‘ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టారు. రష్మిక మందన, అల్లు అర్జున్ జంటగా నటించిన పుష్ప సినిమా నార్త్ లో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది. హిందీలో 100 కోట్లు కొల్లగొట్టిన డబ్బింగ్ సినిమాగా పుష్ప సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో పుష్ప పార్ట్ 2 మీద భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్పను మించి పుష్ప పార్ట్ 2 భారీగా తీయాలని సుకుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

Advertisement

allu-arjuns-house-which-is-like-a-royal-palace-leaked-by-rashmika

Advertisement

మొన్న దేవిత అల్లు అర్జున్ అంటూ ఇంస్టాగ్రామ్ టీం మేకింగ్ వీడియోలో పుష్ప సినిమా షూటింగ్ కనిపించింది. పుష్ప సెట్లోకి ఇంస్టాగ్రామ్ టీం అడుగు పెట్టింది. పుష్ప గాడి రూల్ ని కొద్దిగా చూపించారు. పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నారు అనేది క్లారిటీగా చూపించారు. అయితే తాజాగా పుష్ప గాడు ఉండే ఇల్లు ని రష్మిక మందన లీక్ చేసింది. శ్రీవల్లి పాత్రతో రెండో పార్ట్ లో రష్మిక కనిపించబోతుంది. అయితే ఇప్పుడు రష్మిక బన్నీల మీద సీన్లను సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. సిండికేట్ హెడ్గా పుష్ప ఎదిగిన తరువాత తనకంటూ ఒక ప్యాలెస్ ఉండాలని ఇలా రిచ్ గా కట్టించుకున్నట్లుగా కనిపిస్తుంది.

రష్మిక సెట్ లోకి అడుగు పెట్టింది. అందుకే ఇలా సెట్ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోను నిర్మాణ సంస్థ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో పుష్ప గాడి ఇల్లు చాలా బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ లో పుష్ప సినిమా విడుదల కానుంది. ఇంకా ఇటీవల ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు, సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కు జాతీయ అవార్డులు వచ్చాయి.

Advertisement