Amala paul : కేరళ బ్యూటీ అమలాపాల్ తెలుగులో రామ్ చరణ్ కు జోడిగా ‘ నాయక్ ‘ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అయిన తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు రాలేదు. ఇక ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నటిగా నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో కుడి ఎడమైతే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న అమలాపాల్. ఇటీవల కడావర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీపీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా అమలాపాల్ పోలీసులను ఆశ్రయించింది.
Amala paul : లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న అమలాపాల్…
తన మాజీ ప్రియుడు భవిందర్ సింగ్ లైంగికంగా వేధించి బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే భవీందర్ తో పాటు మరో పదకొండు మందిపై కేసు నమోదు చేసింది అమలాపాల్. దీంతో రంగంల్లోకి దిగిన పోలీసులు భవీందర్ సింగ్ ను అరెస్టు చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 2018 లో అమలాపాల్ భవీందర్ సింగ్ లు కలిసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ అయ్యారు. అది కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. అనంతరం పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

కానీ నిర్మాణ సంస్థలో లావాదేవీల విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకపోగా డబ్బు అడిగితే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని అమలాపాల్ ఫిర్యాదులో పేర్కొంది. భవీందర్ సింగ్ తో పాటు అతని 11 మంది స్నేహితులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. అమలాపాల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం సినిమాలో నటించింది. తెలుగులో లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించింది. ఆ మధ్య విడాకులతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ఎంఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సింగర్ భవిందర్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు అతనితో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.