Anasuya : యాంకర్ అనసూయ పేరు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చాక ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ శాపనార్థాలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడ్డారు. విజయ్ ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక అప్పటి నుండి అనసూయ తగ్గకుండా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుండగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. కొందరు ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో అనసూయకు విజయ్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. తనని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఫ్యాన్ కు అనసూయ ఏ మాత్రం తగ్గకుండా వార్నింగ్ ఇస్తుంది.
Anasuya : అనసూయ వివాదంలోకి రష్మీ…
ఇదిలా ఉంటే అనసూయ విషయంలో రష్మీకి మద్దతు పెరుగుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాదు సాధారణ నెటిజన్లు కూడా రష్మీకి సపోర్ట్ గా తయారవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనసూయ ఇలాంటి విషయాల్లో నోరు జారుతుందని, ఆమెకు దూకుడు ఎక్కువ అని, కాంట్రవర్సీలకు అనసూయ కేరాఫ్ గా నిలుస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో యాంకర్ రష్మీ చాలా పద్ధతిగా, డీసెంట్ గా ఉంటుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆమెకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు.

తన హద్దులు ఏంటో తనకు తెలుసు అని, హుందాగా వ్యవహరిస్తుందని ఆమెను తెగ పొగడేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులంతా రష్మీ వైపు మళ్లారనే విషయం అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చూసిన రష్మీ పండగ చేసుకోండి అంటూ కామెంట్స్ చేయడం విశేషం. రష్మీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పంచుకుంటుంది. కానీ అనసూయ రేంజ్ లో కొంటె పనులు చేయదని చాలా హుందాగా వ్యవహరిస్తుందని, అందుకే రష్మీ ది సెపరేట్ ట్రాక్ అని అంటుంటారు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు యాంకర్ గా చేస్తుంది.