Anchor Anasuya : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ లైగర్ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. విజయ్ దేవరకొండ నటన సినిమాకే హైలెట్ అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా లైగర్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. బుల్లితెర యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే లేపింది.
నిజానికి అనసూయ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా అలాగే పోస్టులు పెడుతూ ఉంటుంది. తనకు ఏదైనా విషయం నచ్చకపోతే డైరెక్ట్ గా మాట్లాడుతుంది తప్పితే డొంకతిరుగుడు ఉండదు. తాజాగా లైగర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రాగానే అనసూయ ట్వీట్ చేసింది.
Anchor Anasuya : విజయ్ దేవరకొండను ఉద్దేశించే అనసూయ పోస్ట్ పెట్టిందా?

అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా అంటూ ఇవాళ మధ్యాహ్నం అనసూయ ఓ ట్వీట్ వదిలింది. ఈ ట్వీట్ తో పాటు #NotHappyOnsomeonesSadness, #FaithRestored అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జతచేసింది.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022
అసలు అనసూయ ఈ ట్వీట్ ను ఎవరి కోసం పెట్టింది అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. లైగర్ సినిమా రిలీజ్ రోజున పెట్టింది కాబట్టి.. ఆ సినిమా గురించా.. లేక సినిమా హీరో విజయ్ దేవరకొండ గురించా. అసలు ఏం జరిగింది మేడమ్.. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కాస్త క్లారిటీ ఇవ్వండి అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్ కు రిప్లయి ఇస్తున్నారు.
కొందరు నెటిజన్లు మాత్రం తమ బుర్రకు పదును పెట్టి అనసూయ పోస్ట్ విజయ్ దేవరకొండ గురించేనని.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్.. మాదర్ చోద్ అనే పదం వాడుతాడు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. అమ్మను అలా తిట్టడం ఏంటి.. అమ్మను తిట్టిన ఉసురు ఊరికే పోదు కదా.. అన్నట్టుగా అనసూయ ఆ సినిమాలోని పదాన్ని గుర్తు పెట్టుకొని ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.
కానీ.. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పే నువ్వు ఇలా నీతులు చెప్పడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అను.. ఎప్పుడో ఏదో సినిమాలో వచ్చిన ఓ డైలాగ్ ను పట్టుకొని ఇప్పుడు కర్మ.. ఉసురు అంటూ పెద్ద పెద్ద పదాలు వాడి తిట్టడం కరెక్ట్ కాదు అంటూ కొందరు నెటిజన్లు అనసూయకు హితువు పలుకుతున్నారు.