Anasuya : సోషల్ మీడియాలో ‘ తాను డాన్సింగ్ మంకీ ‘ అంటూ క్యాప్షన్ పెట్టిన అనసూయ…

Anasuya : అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ఇప్పుడు నటి గా సినిమాల్లోను తన సత్తా చాటుకుంటుంది. ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకెళుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా తన లైఫ్ ను గడుపుతుంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకొని ఆ పాత్రతో ఆమె ఇంకా పాపులర్ అయింది. ఆ సినిమాలో తన క్యారెక్టర్ హిట్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది ఈ అమ్మడు.

Advertisement

ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలను చేస్తుంది. బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగిస్తూ వస్తుంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా క్రేజ్ ను సంపాదించుకుంటుంది. అయితే తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

Anasuya : సోషల్ మీడియాలో ‘ తాను డాన్సింగ్ మంకీ ‘ అంటూ క్యాప్షన్ పెట్టిన అనసూయ…

Anasuya says she was dancing money in social media
Anasuya says she was dancing money in social media

ఈ ఫోటోలో లేత గులాబీ రంగు గౌను ధరించి డాన్స్ వేస్తూ చిలిపిగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ డాన్సింగ్ మంకీ ‘ అంటూ క్యాప్షన్ జోడించింది. అందువల్లనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అయితే ఇక ఫోకస్ అంతా సినిమాలపై పెట్టబోతుందని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement