Anasuya : అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక స్టార్ మా ఛానల్లో సూపర్ సింగర్ జూనియర్ కి యాంకర్ గా చేస్తున్నారు. మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఆమె నటించిన వాంటెడ్ పండుగాడు, అరి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు ఐదారు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే అనసూయ ఇకపై పూర్తిస్థాయిలో సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందంట తనకు పేరు తెచ్చిన టీవీ ఇండస్ట్రీని వదిలేస్తున్నారా అంటే తాను ఏదో ఒక దానికి మాత్రమే పరిమితం అని అనుకుంటుంది అనసూయ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ జబర్దస్త్ షో ను వదిలేస్తున్నానంటే నాకు చాలా భయం వేసింది. టీవీకి దూరం అయిపోతానని భయం చాలా ఉంది. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వచ్చే భయం లాగే అనిపిస్తుంది.
కానీ ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. టీవీ ఇండస్ట్రీ అనేది చాలా పొల్యూట్ అయిపోయింది. నన్ను చాలా బాధ పెట్టింది. ఒకప్పుడు నేను భయపడుతూ టీవీ ఇండస్ట్రీ లోకి వచ్చాను. టీవీ లోకి వెళ్తున్నాను అంటే ఏంటి నువ్వు కెమెరాను ఫేస్ చేస్తావా, మేకప్ వేసుకుంటావా అనేవారు. నేను బ్రాహ్మణ ఫ్యామిలీ లో పుట్టాను. మాది సనాతన బ్రాహ్మణ కుటుంబం. నాకైనా నా క్యారెక్టర్ కైనా హార్ట్ ఫుల్ గా డేంజరస్ గా అనిపిస్తే నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఎంబీఏ చేశాను. హెచ్ఆర్ గా కూడా వర్క్ చేశాను. లేదు అంటే ఇళ్లల్లో అంట్లు తోముకుంటూ ఉంటాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది లేని చోట నేను ఒక్క క్షణం ఉండను. నేనేంటి అనేదే నాకు ముఖ్యం.
Anasuya : నన్ను బ్యాడ్ చేసి మాట్లాడితే ఊరుకోను.

అలాగే నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు శభాష్ అనిపించేలా ఉండాలి. దానికోసమే నేను బతుకుతున్నాను. ఇప్పుడు నేను అదే మార్గంలో వెళుతున్నాను. టీవీ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఏదైతే భయపడ్డానో అవేం లేవు. మంచి చెడు ప్రతిచోట ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఈరోజు చెడు దారి ఎంచుకుంటే తొందరగా పైకి ఎదగొచ్చు అనుకుంటే ఆ దారి ఎంచుకోండి. ఎవరి జడ్జ్ చేయక్కర్లేదు కానీ నేను ఎంచుకున్న దారి నాకు చాలా కంఫర్ట్ ఇచ్చింది. ఏదో ఆఫీస్ కి వెళ్లి వస్తున్నట్టుగానే ఉండేది. చాలా కొత్తగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.