Anasuya : యాంకర్ అనసూయ ఈ మధ్యనే జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. గత నెలలో దర్జా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనసూయ త్వరలో మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ వస్తుంది. తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తను చెప్పే అభిప్రాయాలకు రాజకీయం చేయొద్దంటూ నెటిజన్లను కోరింది.
ఈ మధ్యన గుజరాత్ కు చెందిన బిల్కీస్ భానోపై సామూహిక అత్యాచార కేసులో జైలు నుంచి దోషులు విడుదలైన సంగతి తెలిసిందే. వారికి ఓ సంస్థ సన్మానం చేయగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ను అనసూయ రీట్వీట్ చేస్తూ దారుణం.. మనం స్వేచ్ఛను పునర్ నిర్వహిస్తున్నట్లు అనిపిస్తుంది, అంటే రేపిస్టులను విడిచిపెట్టి మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం అంటూ ఆమె రాస్కొచ్చింది. అయితే ఈ ట్వీట్ పై అనసూయకు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో మైనర్ పై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదని అడిగారు.
Anasuya : తాను చేసే ట్వీట్స్ ను రాజకీయం చేయొద్దంటూ…

దీంతో తన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దంటూ అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఏ బి సి అంటూ అనసూయ రాసుకొచ్చింది. తాను ఏ ట్వీట్ చేసిన అది తన సొంత ఆసక్తి మాత్రమేనని చెప్పింది. తాను ఎవరిని ప్రమోట్ చేసేందుకు, డబ్బుల కోసం చేయడం లేదని తెలిపింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే తాను మాట్లాడుతానని చెప్పింది అనసూయ. ఒకవేళ తాను ఏదైనా మాట్లాడిన తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అందుకే తాను సొంత నిర్ణయానికి రాలేకపోతున్నాను అంటూ అనసూయ ట్వీట్ చేసింది. నేను పెట్టే ట్విట్స్ ని రాజకీయం చేయొద్దంటూ అనసూయ నెటిజన్లను కోరింది.