Anchor Rashmi : బుల్లితెరలో మల్లెమాల చేసే ఈవెంట్లు వారి కొత్త కొత్త ఆలోచనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఏ పండుగ అయినా సరే ఈటీవీలో ఈవెంట్ వస్తుందంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి వినాయక చవితి పండుగ ఈవెంట్ అని చెప్పారు. కానీ అందులో వినాయకుడి గురించి తప్ప మిగతాది అంతా ఉంది. అవే పాటలు, అవే మాటలు, అవే పిచ్చి జోకులు, వెకిలి చేష్టలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో రష్మీ అందరిని కట్టిపడేసింది. రష్మీకి ఇదివరకే పెళ్లి అయిందని ఏవేవో పిచ్చిపిచ్చి కథనాలు వస్తుంటాయి. అయితే రష్మి తల్లిదండ్రులు మాత్రం విడిపోయారు.
Anchor Rashmi : నిజంగా బ్రేకప్ అయిందా…
రష్మీ తన చిన్నతనం నుంచి కూడా తన అమ్మే పెంచి పోషించి పెద్ద చేసింది. తండ్రి ప్రేమ అంటే ఏంటో తనకు తెలియదని రష్మీ స్టేజ్ మీద ఎన్నోసార్లు కంటతడి పెట్టుకుంది. అలాంటి రష్మీ ఇప్పుడు బ్రేకప్ బాధను అందరికి అర్థమయ్యేలా చెప్పింది. రష్మీ పర్ఫామెన్స్ చేసిన తీరు చూస్తుంటే నిజంగానే తనకు బ్రేకప్ జరిగిందా అనే అనుమానం వస్తుంది. తాను ఏది చేసినా జనాలను ఎంటర్టైన్ చేసేందుకేనని, ఇదివరకే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది రష్మి తెరపై చూపించేది నిజం కాదని చెప్పుకొచ్చింది. సుదీర్ ని పెళ్లి చేసుకో అని అభిమానులు పదేపదే అడుగుతుండడంతో రష్మీ ఇలా చెప్పింది. మేమిద్దరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, ప్రేక్షకులను అలరించడానికి అలా చేస్తామని తెలిపింది.

అయితే రష్మీకి లవ్ స్టోరీ ఉందని, బ్రేకప్ జరిగిందనేది నిజమా కాదా అన్నది తెలియడం లేదు. తాజాగా ఆమె డాన్స్ పర్ఫామెన్స్ చూసి అందరూ ఒకే డైలాగ్ చెబుతున్నారు. బాధలోంచి వచ్చే ఎమోషన్ డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇదే మాటలను ఈవెంట్లో కూడా అనేశారు. నిజంగా రష్మి అంత బాధ అనుభవించిందా. అందుకే అంతలా డాన్స్ చేసిందా అని జనాలు అనుకుంటున్నారు. అటు నువ్వే ఇటు నువ్వే అనే పాటకు రష్మీ చేసిన పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది.