Rashmi Gautam : అండమాన్ లో ఫుల్ ఎంజాయ్ చేసిన యాంకర్ రష్మి.. దేన్నో తెగ జుర్రేస్తోందిగా…!!!

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. మొదటగా రష్మి సినిమాలో హీరోయిన్గా నటించినందుకు వచ్చారు. కానీ వెండితెర మీద సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరకి పరిమితం అయ్యారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తన పూర్తి ఫోకస్ మొత్తం బుల్లితెర ప్రోగ్రాం మీద పెట్టినట్లు అనిపిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్ల తో రష్మీ బిజీగా ఉంటున్నారు. ఈ షోలతో యాంకర్ గా రష్మి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.

Advertisement

anchor-rashmi-fully-enjoyed-in-andaman

Advertisement

ఇక ఇప్పుడు సుధీర్ , రష్మీ లవ్ ట్రాక్ గురించి బుల్లితెర పై కనిపించడం లేదు. ఒకప్పుడు వీరి జంట బుల్లితెరపై హాట్ టాపిక్ గా ఉండేవారు. కానీ సుధీర్ హీరోగా వెండితెరపై బిజీగా ఉన్నారు. దీంతో రష్మీ సుధీర్ల టాపిక్ బుల్లితెరపై తగ్గింది. సుధీర్ హీరోగా వెండితెర మీద బిజీగా ఉంటే రష్మి యాంకర్ గా బుల్లితెర మీద బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరిని పెట్టి సినిమా తీయాలని చాలామంది చూస్తున్నారు. కానీ కథ సెట్ అవడం లేదని మంచి కథ దొరికితే కలిసి చేస్తామని సుధీర్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయితే బుల్లితెర మీద వీరిద్దరని అభిమానించిన ఫ్యాన్స్ వెండితెరపై వీరిద్దరిని హీరో హీరోయిన్గా చూడాలని కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

బుల్లితెర మీద బిజీగా ఉండే రష్మీ మధ్య మధ్యలో వెకేషన్ ల కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి అండమాన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెకేషన్ లోని రాధానగర్ బీచ్ బాగుందంటూ.. ఐ లవ్ ఇండియా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ ఓ పదార్థాన్ని సూప్ ని త్రాగుతూ అద్భుతంగా ఉందని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement