Anchor Suma : డాన్స్ తో అందరిని ఫిదా చేసిన యాంకర్ సుమ .. వైరల్ వీడియో!!

Anchor Suma : సూపర్ స్టార్స్ వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా ఉంటారు. ఇక బుల్లితెర సూపర్ స్టార్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన యాంకర్ తో స్టార్ డంను సంపాదించుకున్నారు. వెండితెరపై హీరో హీరోయిన్లకు ఎటువంటి క్రేజ్ ఉంటుందో బుల్లితెర మీద సుమకి అంతకన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఇక ఆమె ఓవైపు బుల్లితెర షోలు చేస్తూ మరోవైపు సినిమా ఈవెంట్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడు బిజీగా ఉండే సుమ తాజాగా ‘ స్పార్క్ ది లైఫ్ ‘ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకరింగ్ చేశారు.

Advertisement

Anchor Suma : స్టేజీపై సుమ డాన్స్ అదుర్స్.. వీడియో చూశారా..? | Anchor suma dance video at spark movie pre release event-10TV Telugu

Advertisement

సుమ మల్టీ టాలెంటెడ్. ఈ విషయంలో సందేహం లేదు. ఆమె సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. ఆమెకు మూడు నాలుగు భాషల మీద పట్టు ఉంది. మరీ ముఖ్యంగా తెలుగును అనర్గళంగా మాట్లాడుతారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. తన చలాకి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అందుకే ఆమెకు ఇంత క్రేజ్. అయితే తాజాగా జరిగిన స్పార్క్ ది లైఫ్ సినిమా ఈవెంట్లో సుమ యాంకరింగ్ తో పాటు డాన్స్ కూడా చేశారు. ఆమె డాన్స్ కి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. విక్రాంత్ హీరోగా నటించిన స్పార్క్ ది లైఫ్ మూవీ ఈనెల 17న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలోని ఓ పాటకు హీరో హీరోయిన్లతో కలిసి సుమ డాన్స్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సుమ ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని వచ్చారట. హీరోయిన్గా పలు సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా గుర్తింపు రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. బుల్లితెరపై సూపర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె కొడుకు రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమాలో నటించారు. ఇది త్వరలోనే విడుదల కానుంది.

Advertisement