Viral News : ప్రస్తుత కాలంలో చాలామంది ఎంత సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారో అంతేే సింపుల్ గా విడాకులు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుని రెండు ,మూడు ఏళ్లకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సినీ సెలబ్రిటీలు కూడా విడాకులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కి చెందిన నటుడు షర్దిన్ ఖాన్ మరియు నటాషా మద్వానీ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ 2005లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి దియాని ఇసబెల్లా ఖాన్( 10 ) అనే కూతురు అజారియస్ షర్దిన్ ఖాన్ అనే కుమారుడు కూడా జన్మించారు.
అయితే దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ జీవనం కొనసాగించిన తర్వాత వీరిద్దరూ విడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాక గత ఏడాది నుండే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. అయితే 18 ఏళ్ల పాటు సహజీవనం కొనసాగించిన ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గతంలో 2011లో ఈ జంట లండన్ కు షిఫ్ట్ అయ్యారు. వీరికి సంతాన సమస్యలు ఉండడంతో అక్కడ ఓ డాక్టర్ ను సంప్రదించినట్లు.. ఐవీఎస్ ద్వారా నటాషా గర్భంలోకి కవలలు ప్రవేశించినట్లు ఓ ఇంటర్వ్యూలో భాగంగా షర్దిన్ చెప్పుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కవలలు 6వ నెలలో గర్భంలోనే ప్రాణాలను వదలడం వారిని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. పిల్లల కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్న ఈ జంటకు అది ఒక చేదు అనుభవం అని చెప్పాలి.
ఆ తర్వాత వీరికి ఇసబేల్లాఖాన్ జన్మించింది. పిల్లలు లేకుండా ఎన్నో కష్టతరమైన పరిస్థితులను సమాజాన్ని ఎదుర్కొన్న ఈ దంపతులకు ఈ పాప జన్మించడం ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఇన్ని కష్టాలను ఎదుర్కొని ఇంతకాలం కలిసి ఉన్న ఈ దంపతులు ఇప్పుడు ఇలా విడిపోవడం చూసి నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినీ ఇండస్ట్రీ వాళ్లకి అసలు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షర్దిన్ ఖాన్ విష్ ఫుట్ అనే సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెలతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.