Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన నటనతో, తన అందంతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ వహించిన ‘ అఆ ‘ సినిమాలో నటించి మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది అనుపమ. ఆ తర్వాత బోలోడు సినిమాలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్యనే హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే రీసెంట్ గా అనుపమ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన అమ్మడు కార్తికేయ 2 సినిమా తర్వాత మీరు ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు, అందరూ హీరోయిన్లు లాగా కమర్షియల్ హిట్ కోసం చూస్తారా అని ఓ నెటిజన్ అడగ్గా.. అనుపమ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అనుపమ మాట్లాడుతూ నేను హీరోయిన్ గా చేసే సినిమాలో స్టోరీని ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా గమనించేది కథ. కథలో నా పాత్ర ఆ పాత్ర కథకి ఎంత న్యాయం చేయగలుగుతుంది. అంతేకానీ హీరో భజన చేస్తూ, హీరో తానా అంటే తందానా అంటూ హీరో చుట్టు తిరిగే హీరోయిన్ పాత్ర ఉన్న క్యారెక్టర్స్ నాకు వచ్చినా నేను చేయను. అలాంటి తప్పుడు నిర్ణయం నేను ఎప్పటికీ తీసుకోను.
Anupama Parameswaran : పూజ రష్మికల పరువు తీసేసిన అనుపమ…

నా వరకు హీరోయిన్ అంటే కచ్చితంగా నటన పరంగా మెప్పించగలగాలి. కథలో కాస్తయినా ఆమెకు బలం ఉండాలి. అప్పుడే నేను హీరోయిన్ గా చేస్తాను అంటూ కామెంట్స్ చేసింది. అయితే కొందరు నెటిజన్లు అనుపమ మాటలను రష్మిక మందన, పూజ హెగ్డే కు ట్యాగ్ చేస్తూ.. అను మాటలని విన్నారా, మీరు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మీ కెరియర్ బాగుపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ మాటలను పరోక్షంగా రష్మిక, పూజా హెగ్డే లపై ప్రభావం చూపినట్లయింది. అదీ నిజమే రష్మిక, పూజ ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ అలాంటివే. హీరో చుట్టు తిరగడమే, హీరో భజన చేయడం, ముద్దులు పెట్టుకోవడమే అంతే సో దీంతో అనుపమ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని అంటున్నారు ఫాన్స్.