Aswini Dutt : అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కీర్తి సురేష్ కు స్టార్ ఇమేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు కీర్తి సురేష్ ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పచ్చు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు గాను మంచి పేరు దక్కించుకుంది అంతేకాకుండా అనేక అవార్డులు ఈమని వరించాయి.
అయితే ఈ సినిమాకి ముందుగా వేరే హీరోయిన్ దగ్గరకు ఈ పాత్ర కోసం ప్రయత్నించడం జరిగింది. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఓ ప్రముఖ షోలో మహానటి ప్రాజెక్టు గురించి అనేక విషయాలను వెల్లడించడం జరిగింది. ఈ సినిమాకు కీర్తి సురేష్ ముందు ఓ మలయాలని అనుకున్నాం కానీ అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటాయి కావున నేను చేయను అంటూ అనేక షరతులు పెట్టడం జరిగింది. దీంతో ఆమెని తీసుకోవడానికి వీల్లేదని మొహం మీద అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు చెప్పాను అని అశ్విని అశ్విని దత్ వెల్లడించారు.
Aswini Dutt : అనేక షరతులు పెట్టడం కారణంగా

తర్వాత కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా రావడం ఒక్కసారిగా ఈమె ఇమేజ్ అనుకోని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం అన్ని వరుసగా జరిగిపోయాయి. అయితే ఆ హీరోయిన్ పేరు చెప్పడం అశ్విని దత్ కు ఇష్టం లేకపోవడంతో ఈ పేరు అరౌండ్ చేయడం జరగలేదు. అయితే మలయాళ హీరోయిన్ అనగానే నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతే కాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఏదేమైనా నిత్యామీనన్ మంచి సినిమాను మిస్ చేసుకుందని సోషల్ మీడియా ద్వారా ఈమె అభిమానులు బాధపడుతున్నారు.