Mahesh Babu – Balakrishna : మహేశ్ ముఖంలో నవ్వు తెప్పించిన బాలయ్య.. వైరల్ వీడియో..!

Mahesh Babu – Balakrishna : సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటేనే చిరునవ్వుకు కేరాఫ్ అడ్రస్. ఆయన నవ్వితే చాలా బాగుంటారు. అసలే ఆయన అందగాడు. ఆయన ముఖం మీద కాస్త నవ్వు ఉంటే ఇక ఆయనకు తిరుగులేదు. కానీ.. ఆయన తండ్రి కృష్ణ చనిపోవడంతో గత రెండు రోజుల నుంచి ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తన తండ్రి భౌతికకాయం మీద పడి గుండెలు పగిలేలా రోదించారు మహేశ్ బాబు. తన తండ్రి కృష్ణ.. తనకు జన్మనివ్వడం మాత్రమే కాదు.. ఒక గైడ్ గా, రోల్ మోడల్ గా మహేశ్ వెన్నంటే ఉన్నారు. మహేశ్ బాబు సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగారంటే దాంట్లో కృష్ణ పాత్ర కూడా చాలా ప్రముఖమైనది.

Advertisement
balakrishna brings smile on mahesh babu face
balakrishna brings smile on mahesh babu face

కృష్ణ భౌతికకాయానికి చాలా మంది ప్రముఖులు నివాళులు అర్పించారు. అందులో బాలకృష్ణ ఒకరు. చాలామంది మహేశ్ ను ఓదార్చడానికి ప్రయత్నించారు కానీ.. ఎవరి వల్ల కాలేదు. కానీ.. బాలకృష్ణ మాత్రం మూడీగా ఉన్న మహేశ్ ముఖంలో నవ్వు తెప్పించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Mahesh Babu – Balakrishna : బాలయ్య బాబు అంటే అంతే మరి అంటున్న నెటిజన్లు

కష్టకాలంలో ఉన్న మహేశ్ కు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పి మహేశ్ ముఖంలో నవ్వు తెప్పించిన బాలకృష్ణకు మహేశ్ ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు. ఈ సంవత్సరంలోనే మహేశ్ కు ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. తన అన్నయ్య రమేశ్ బాబుతో పాటు తన తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు కృష్ణ కూడా చనిపోవడంతో ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కానీ.. బాలకృష్ణ మాత్రం ఆయన ముఖంలో నవ్వు తెప్పించారు

Advertisement