NBK 109 : తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో బాలయ్య నేటి తరం హీరోలతో పోటీపడుతూ దూసుకెళ్తున్నారు. అసలు బాలయ్య పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో కెరటంలా లేచి వరుస విజయాలతో ముందుకు వెళుతున్నారు. ఇక అఖండ ముందు సినిమాలు చూస్తే బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. అంతకుముందు సినిమాలు ఏ ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలకు 10 కోట్లు రావడం కష్టమే అన్నట్లుగా మార్కెట్ పడిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితులలో బోయపాటి శీను తీసిన అఖండ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ తెచ్చి పెట్టింది. దీంతో బాలయ్య ఒక్కసారిగా విజయాల బాట పట్టాడు.
2021లో విడుదలైన అఖండ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 2023లో సంక్రాంతికి కానుకగా వచ్చిన వీర సింహారెడ్డి 100 కోట్లకు పైగా వసూలు చేసి మరో హిట్నిక్ బాలయ్య ఖాతాలో వేసింది. ఇక ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ కొట్టి హ్యాట్రిక్ సాధించాడు. అనిల్ రావిపూడి తలకెక్కించిన భగవాన్ కేసరి సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించిన బాలయ్య సంక్రాంతి విన్నారుగా నిలిచాడు. అయితే భగవంత్ కేసరి సినిమా సెట్స్ పై ఉండగానే బాలయ్య బాబి తో ప్రాజెక్టు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య 109వ చిత్రంగా తేరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది.
ఇక ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ ము గమనించినట్లయితే పెట్టెలో మారాణాయుధాలు , డబ్బుతో పాటు ,మాన్షన్ హౌస్ బాటిల్ కూడా ఉంది. దీని ప్రకారం బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైంది. అయితే తాజాగా మరో పోస్టర్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సినీ బృందం అప్డేట్ కోసం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గొడ్డలికి కళ్ళజోడు తగిలించి ఉంది. అలాగే ఆంజనేయ స్వామి లాకెట్ కూడా దానిలో చూడవచ్చు. ఇక కళ్ళజోడులో ఏదో రిఫ్లెక్ట్ అవుతున్న ఆకారం కనిపిస్తుంది. కేవలం సినిమా పోస్టర్ల తోనే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బాలయ్య ఈసారి కూడా హిట్ కొట్టే సూచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Lights Camera Action 🪓👓
Blood Bath Ka Brand Name 🩸
Violence Ka Visiting Card 🔥Natasimham #NandamuriBalakrishna garu & @dirbobby’s #NBK109 Shoot Begins from today! 😎#NBK109ShootBegins 💥@vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/goKhCAHbdK
— Naga Vamsi (@vamsi84) November 8, 2023