Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో ప్రచారాలు చేస్తూ బర్రెలక్క దూసుకెళ్తోంది. ఇక ఆమె నియోజకవర్గ ప్రజలతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే ప్రతి గ్రామానికి తిరుగుతూ ప్రచారాలు నిర్వహిస్తున్న బర్రెలక్క తాజాగా కొల్లాపూర్ లోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఈ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ విజిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా సూచించారు.

Advertisement

అలాగే బర్రె లెక్క మాట్లాడుతూ…నేను నామినేషన్ వేసినప్పటి నుండి చాలా భయపడుతున్నానని…నన్ను బెదిరించే విధంగా చాలామంది కాల్స్ చేస్తున్నారని..మనలాంటివారు నామినేషన్ లో నిలబడితే ఇలా చేస్తారా అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే కచ్చితంగా నేను గెలుస్తానని వాళ్ళు భయపడుతున్నారు. ఓ మారుమూల గ్రామం నుండి వచ్చిన అమ్మాయి వారి జీవితాలను నాశనం చేస్తుందని వారి భయం. అందుకే నన్ను బెదిరించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఇక నేను చాలా నిరుపేద రాలిని నామినేషన్ వేసేందుకు కూడా కొంత అప్పు చేశాను. ఎందుకంటే ఈ పేదింటి అమ్మాయిని మీరందరూ ఆదరిస్తారని నమ్మకం. ఓట్ కి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గరర ఏం లేవు కానీ గెలిస్తే మాత్రం మీ పనులు చేసేందుకు ఖచ్చితంగా కష్టపడతా.

Advertisement

మీరు విజిల్ గుర్తుకు ఓటెయ్యండి చాలు అభివృద్ధి పనులు నేను చూసుకుంటాను. నేను ఒక్కదాన్నే కాదు మిమ్మల్ని అందరిని అసెంబ్లీకి తీసుకెళ్తా , మనకు కావలసినవి మనం తెచ్చుకుందాం అంటూ బర్రెలక్క చెప్పుకొచ్చింది. అలాగే మన ప్రాంతంలో విద్య వైద్యం రోడ్లు సరిగా లేవు , నేను గెలిస్తే ఖచ్చితంగా అవన్నీ చేపిస్తాను. మన తాత కెసిఆర్ తో పోరాడాలంనే మీరు నన్ను గెలిపించాలి. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదంటూంటూ చెప్పుకొచ్చింది. నా గెలుపుని ముందే ఊహించిన చాలామంది నన్ను పక్కకు లాగేందుకు నా తమ్ముడుపై దాడి చేశారు. అయినప్పటికీ నేను వెనుకడుగు వేయలేదు. అధైర్య పడలేదు..మన కోసం నేను కచ్చితంగా పోరాడుతా అంటూ చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలక్క కు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.

Advertisement