krithi shetty : ఆయన ఇచ్చిన గిఫ్ట్ నాకు ప్రత్యేకమైనది అంటున్న బెబామ్మ.

krithi shetty : ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి వరుస సినిమాలతో హిట్ల ను అందుకుంటుంది. తన అందంతో కుర్రకారు మనసులను దోచుకుంటుంది. ఈమధ్య వచ్చిన ‘ ది వారియర్ ‘ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తన సినీ ప్రయాణం ఎలా సాగిందో చెప్పింది. ‘ చాలామంది నటీనటులు డాక్టర్ని కాబోయి యాక్టర్ ని అయ్యారని చెబుతుంటారు. కానీ నేను కూడా అలాగే డాక్టర్ కాబోయే డాక్టర్ని అయ్యాను.

Advertisement

నేను చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నా. దానికి కారణం ముంబైలోని మా ఇంటి దగ్గరలో ఓ డాక్టర్ డబ్బు కోసం అనవసరమైన మందులు రాసి ఇవ్వడం, పేదవారని కూడా చూడకుండా ఎక్కువ ఫీజు తీసుకోవడం వంటివి చేసేవాడు. ఆయన్ని చూసి రోగుల పట్ల నిజాయితీగా ఉంటూ, పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకున్న. అంతే తప్ప ఈ నటన, సినిమాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పుకొచ్చింది.అమ్మ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో నేను సినిమాలోకి వచ్చా.

Advertisement

 krithi shetty : ఆయన ఇచ్చిన గిఫ్ట్ నాకు ప్రత్యేకమైనది అంటున్న బెబామ్మ.

 Bebamma says that the gift given by him is special for me
Bebamma says that the gift given by him is special for me

మాకు తెలిసి ఒకతను నాకు చెప్పకుండా డైరెక్టర్ బుచ్చిబాబుకు నా ఫోటోలు పంపాడు. వాటిని చూసి దర్శకుడు మా అమ్మ నాన్నల్ని సంప్రదించి ‘ఉప్పెన ‘ అవకాశం గురించి చెప్పారు. సినిమాల గురించి అసలు ఏమీ తెలియని నేను నో చెప్పాలనుకున్న. అమ్మానాన్నలు మాత్రం ఏం పర్వాలేదు, నటించు .నువ్వు తప్పకుండా స్టార్ అవుతావు ముందు ప్రయత్నించు అని ప్రోత్సహించి హైదరాబాద్ పంపారు. ఉప్పెన కథ విన్నాక చేయాలనిపించింది.

అయితే లాక్ డౌన్ వలన సినిమా వాయిదా పడిన ‘ నీ కళ్ళు నీలి సముద్రం ‘ పాటకు వచ్చిన ఆదరణతో నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా చూసిన అందరూ నన్ను బేబమ్మ అని పిలుస్తున్నారు. అలాగే ‘ బంగార్రాజు ‘ సినిమాలో నాగలక్ష్మి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. రెండు సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రలు చేయడం కాస్త అసంతృప్తి ఉంది. ‘ ది వారియర్ ‘ సినిమాలో రామ్ కు పోటీగా డాన్స్ చేశానని చాలామంది ప్రశంసించారు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది.

అలాగే ఎప్పటికైనా బాహుబలి లో అనుష్కలాంటి పాత్ర చేయాలని నా డ్రీమ్ అని చెప్పుకొచ్చింది.మాది కర్ణాటకలోనే ఉడిపి. నాన్న వ్యాపారం రిత్యా ముంబైలో స్థిరపడ్డాం. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. నేను ఒక్కదాన్ని సంతానం కావడంతో అమ్మానాన్నలు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. కథల ఎంపిక విషయంలో అమ్మ సాయపడుతుంది. నాన్నేమో నలుగురిలో ఎలా ఉండాలి అని చెబుతారు. ఇప్పుడు వరుస సినిమాలు రావడంతో అమ్మ నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం.

నాన్న ని బాగా మిస్ అవుతున్నా. అలాగే అలియా భట్ ని చూసి ఎంతో స్ఫూర్తి పొందా. ఆమె కథలు పెంచుకునే తీరు బాగుంటుంది. నటన చాలా సహజంగా ఉంటుంది. ఉప్పెన విడుదల అయ్యాక చిరంజీవి సర్ ఓ లేఖ రాసి దాంతోపాటు ఓ గిఫ్ట్ ప్యాక్ చేసి పంపారు. అది నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన జ్ఞాపకం. నేను ‘రంగస్థలం’ చూశాక రామ్ చరణ్ కి అభిమానినయ్య. అలానే కార్తి, శివ కార్తికేయన్ సినిమాలు నచ్చుతాయి.

నిజం చెప్పాలంటే శివ కార్తికేయన్ నా మొదటి క్రష్. ఆయన నటించిన సినిమాలన్నీ చూసా నటనకు పడిపోయా అని చెప్పుకొచ్చింది ఈ భామ. అలానే స్వీట్స్ అంటే పిచ్చి ఫిట్నెస్ కోసం బలవంతంగా మానేశాను. సాధారణంగా నాకు కోపం రాదు. ఒకవేళ వస్తే సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని నిద్రపోతా. మెలకువ వచ్చేసరికి తగ్గిపోతుంది.

అలా ఉండడమే నా బలం. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ లేకుండా ఏడుస్తా. ఎవరైనా గట్టిగా మాట్లాడిన, నన్ను కసురుకున్న, నా ముందు గొడవ పడిన నాకు వెంటనే ఏడుపొచ్చేస్తుంది. అదే నా బలహీనత అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ భామ డిగ్రీ చదువుతున్నట్లు, కాలేజీకి వెళ్లే తీరిక లేకపోవడంతో సమయం దొరికితే ఆన్లైన్ లో క్లాసులకు హాజరవుతుందట

Advertisement