Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 ఇల్లు అదిరిందోచ్.. మిగితా సీజన్లను తలదన్నేలా ఉన్న ఇల్లు చూస్తే అవాక్కవుతారు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 6 అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు సీజన్లను బిగ్ బాస్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు సీజన్లు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సీజన్ అంటే బిగ్ బాస్ 6 కి మొత్తం 19 కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. కాకపోతే 15 మంది మాత్రమే సెప్టెంబర్ 4 న హౌస్ లోకి వెళ్లనున్నారు. మిగిలిన నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారు.

Advertisement
bigg boss 6 telugu season house revealed
bigg boss 6 telugu season house revealed

ఇప్పటికే బిగ్ బాస్ లోగో, టీజర్ ను విడుదల చేశారు. ఆ వీడియోలకు చాలా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన వీడియోను బిగ్ బాస్ యాజమాన్యం విడుదల చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ మాత్రం అదిరిపోయింది. ఇప్పటి వరకు అన్ని సీజన్లలోని ఇంటి కంటే ఈ ఇల్లు మాత్రం అదిరిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ల లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది సెలబ్రిటీలతో పాటు సింగర్స్, బుల్లితెర నటీనటులు, ఓ సామాన్యుడు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 హౌస్ టూర్ వీడియో వైరల్

అయితే… గత సీజన్లకు భిన్నంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ ను ముస్తాబు చేశారు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. ఇల్లును ఎలా సెట్ చేశారు.. సోఫా సెట్స్ ఎక్కడ ఉన్నాయి.. విజువల్స్ తో పాటు కంటెస్టెంట్స్ ఎంట్రీని కూడా ఈ వీడియోలో చూపించారు. అంటే బిగ్ బాస్ 6 ప్రారంభ తేదీకి సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్ల పర్ ఫార్మెన్స్ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి సెప్టెంబర్ 4న గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం తెలుగు బుల్లితెర అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

Advertisement