Bigg Boss 6 Telugu : బుల్లితెరలో బిగ్ బాస్ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది.
బిగ్ బాస్ షో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అందుకే ఇంత క్రేజ్ ఉన్న ఈ షోకు ఇప్పుడు ఆరో సీజన్ మొదలు కాబోతుంది. బిగ్బాస్ షో ఆరో సీజన్ కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ గేట్ దగ్గర నుంచి లోపల బెడ్ రూమ్ వరకు అన్ని అందంగా అమర్చారట. అలాగే కంటెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్స్ వరకు అన్ని పకడ్బందీగా ఉండేలా చూస్తున్నారట. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లు ఎవరనేది సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ గా మారింది.
లిస్టు ప్రకారం ఆ అంటే అమలాపురం అంటూ ఐటమ్ సాంగ్ తో షేక్ చేసిన అభినయశ్రీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆర్జీవి మెచ్చిన హీరోయిన్ ఇనయ సుల్తానా కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. అలాగే నటుడు బాలాదిత్య, యూట్యూబ్ ఆది రెడ్డి, నువ్వు నాకు నచ్చావు ఫేమ్ పింకీ సుదీప, జబర్దస్త్ కమెడియన్స్ ఫైమా, చలాకి చంటి, నటుడు శ్రీహాన్, సింగర్ రేవంత్, వాసంతి కృష్ణన్, యాంకర్ ఆరోహి రావు, తన్మయ్, శ్రీ సత్య, బుల్లితెర దంపతులు రోహిత్ మెరీనా అబ్రహం, కామన్ మ్యాన్ రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, దీపిక పిల్లి కంటెస్టెంట్లుగా పాల్గొననున్నట్లు తెలుస్తుంది. వీరిలో ఒకరిద్దరూ మిస్సయ్యే చాన్స్ ఉంది.
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షోలో ఆ ఐటమ్ గర్ల్, ఆర్జీవి హీరోయిన్… ఇంకా ఎవరంటే…?

ఇదిలా ఉంటే ఈ సీజన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట మేకర్స్. సాధారణంగా నామినేషన్ సోమవారం జరుగుతాయి. కాని ఈసారి మాత్రం టాస్క్ ను బుధవారం ప్రసారం చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. వీక్ డేస్ లో పెద్దగా జనాలు షోని చూడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ సెప్టెంబర్ నాలుగున సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా స్టార్ట్ కానుంది. బిగ్ బాస్ షో కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.