Bigg Boss 7 2nd week : రెండవ వారంలో షాకింగ్ ఓటింగ్…దూసుకుపోతున్న రైతుబిడ్డ ప్రశాంత్….

Bigg Boss 7 2nd week : బిగ్ బాస్ సీజన్ సెవెన్ సరి కొత్తగా సాగుతుంది. ట్విస్ట్ లు టాస్క్ లతో మేకర్స్ అదరగొడుతున్నారు. అయితే రెండవ వారం బయటకు వెళ్లేందుకు 9 మంది నామినేషన్ లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులు ఎక్కువగా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారనేది ఈజీగా అర్థమవుతుంది. పల్లవి ప్రశాంత్ ను బయటికి పంపించేందుకు ఎక్కువ మెజారిటీ కుటుంబ సభ్యులు నామినేట్ చేయడం జరిగింది. కానీ బయట ఓటింగ్ చూస్తే మొత్తం ఉల్టా పుల్టాగా జరుగుతుంది. ఎక్కువగా పల్లవి ప్రశాంత్ కు పాజిటివ్ ఓటింగ్ అయితే బయట కనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ కు ఏకంగా 39% ఓటింగ్ ఉంది.

Advertisement

bigg-boss-7-2nd-week-elimination

Advertisement

మొదటి వారం ఏవిధంగా ఉందో ఈ రెండవ వారం కూడా పల్లవి ప్రశాంత్ సేవ్ అయ్యేందుకే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా వేదిక ఎక్కడ చూసుకున్నా పల్లవి ప్రశాంత్ కు అయితే పాజిటివ్ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో 39% పల్లవి ప్రశాంత్ ఉండగా , రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ కు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న నటుడు శివాజీ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు శివాజీ అభిమానులు మరియు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎక్కువమంది శివాజీకి ఓటింగ్ చేస్తున్నారు. దీంతో శివాజీ 21%తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన అమర్దీప్ మూడో స్థానంలో ఉన్నాడు. శివాజీకి మరియు అమర్దీప్ కు మధ్య 2.5% వ్యత్యాసం కనిపిస్తుంది.

bigg-boss-7-2nd-week-elimination

ఇక నాలుగో స్థానంలో రతిక ఉన్నారు. ఐదవ స్థానంలో డాక్టర్ గౌతమ్ కృష్ణ కొనసాగుతుంటే…ప్రిన్స్ యావర్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరికి 0.25 పర్సంటేజ్ మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. షకీలా లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంటే లాస్ట్ లో ఉన్న టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే మొదటివారం టేస్టీ తేజకు పాజిటివ్ వచ్చింది కానీ రెండవ వారం నెగిటివ్ వైబ్ కనిపిస్తుంది. దీంతో రెండవ వారం ఎలిమినేషన్ రౌండ్ లో షకీలా మరియు టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. ఎలిమినేషన్ కు ఇంకాస్త టైం ఉంది కాబట్టి వీరిద్దరిలో ఎవరికి ఓటింగ్ ఎక్కువ వస్తే వారు సేవ్ అవుతారని చెప్పవచ్చు.

Advertisement