Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకున్న నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. 14 మందితో ప్రారంభమైన ఈ ఆట లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక నిన్న ముగిసిన మూడో వారం ఎలిమినేషన్ లో సింగర్ దామిని ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళింది. దీంతో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ లైవ్ ఎపిసోడ్ ఇటీవల పూర్తయింది. అయితే గత మూడు వారాలతో పోలిస్తే ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా సాగాయి. ఇంతకుముందుల సొల్లు కారణాలు చెత్త కబుర్లు చెప్పి నామినేట్ చేసే వీలు లేకుండా చేశాడు బిగ్ బాస్.
దీనికోసం జ్యూరీ పద్ధతిని తీసుకొచ్చాడు. ఇక ఈ జ్యూరీలో హౌస్ మేట్స్ సందీప్ శివాజీ శోభ శెట్టి ఉన్నారు. అయితే నామినేట్ చేయాలి అనుకునేవారు వారి యొక్క రీజన్ చెప్పి కంటెస్టెంట్ తో పాటు జ్యురీ మెంబర్స్ ని కూడా ఒప్పించాల్సి ఉంటుంది. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిని బోన్ లో నిల్చబెట్టి కారణం చెప్పాలి. జ్యూరీ మెంబర్స్ సపరేట్ గా కూర్చొని ఇదంతా వింటూ ఉంటారు. కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలు సరైన రీసన్ అని అనిపించకపోతే జ్యూరీ మెంబర్స్ వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు జ్యూరీ సభ్యులను కూడా ఒప్పిస్తేనే నామినేషన్ ను సేకరిస్తారన్నమాట.
ఇలా 4వ వారం నామినేషన్ ప్రక్రియ కాస్త భిన్నంగా జరిగిందని చెప్పాలి. ఇక ఈ నామినేషన్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ కాగా వారిలో రతిక రోజ్ ,టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ , ప్రియాంక జైన్ , శుభ శ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో రతికను శుభశ్రీ నామినేట్ చేసి ఆస్తమానం బిగ్ బాస్ హౌస్ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుందని, ఇక్కడ లేని వ్యక్తిని బయట ఉన్న సెలబ్రిటీ గురించి హౌస్ లో మాట్లాడటం బిగ్ బాస్ రూల్ కి విరుద్ధమని శుభశ్రీ చెప్పుకొచ్చింది. ఈ కారణంతో శుభశ్రీ రతికను నామినేట్ చేయగా జ్యూరీ సభ్యులు కూడా దీనికి మద్దతు ఇచ్చారు.
అనంతరం ప్రిన్స్ యావర్ ప్రియాంక జైన్ ను నామినేట్ చేస్తూ మూడవ పవర్ హస్త్ర కోసం కంటెండర్స్ అవ్వడానికి శోభశెట్టి మరియు ప్రియాంక జెన్ తనను అన్యాయంగా తప్పించారని యావర్ వాదించాడు. ఇక వారిద్దరూ అమ్మాయిలు అవడంతో ఫెమినిజం చూపించి తనను తప్పించినట్లు యావర్ పేర్కొన్నారు. దీనికి జ్యూరీ లో ఉన్న శోభ శెట్టి అంగీకరించలేదు. ఇది సరైన రీజన్ కాదంటూ శోభ వాదించింది కానీ మిగిలిన జ్యూరీ మెంబర్స్ సపోర్ట్ తో యావర్ ప్రియాంకను నామినేట్ చేయగలిగాడు. ఇలా నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఈ ఆరుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.